*మైత్రి పెర్టినెస్ట్ ఆపరేషన్ థియేటర్ ను ప్రారంభించిన ఆదాల*
నెల్లూరు నగరంలోని మినీబైపాస్ రోడ్డు అన్నమయ్య సర్కిల్స్ సమీపంలో నూతనంగా నిర్మించిన మైత్రి ఫెర్టినెస్ట్ సంతాన సాఫల్య కేంద్రం అండ్ అడ్వాన్సుడ్ లాప్రోస్కోపిక్ ఉమెన్ కేర్ సెంటర్లో ఆపరేషన్ థియేటర్ ను శుక్రవారం నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్ణ వెంకయ్య పాశం శ్రీనివాస్, యేసు నాయుడు, సిహెచ్ హరిబాబు యాదవ్, మల్లు సుధాకర్ రెడ్డి, కొండేటి నరసింహారావు, కల్లూరు లక్ష్మీరెడ్డి, షేక్ మొయిద్దీన్, పాతపాటి ప్రభాకర్, బెల్లంకొండ వెంకయ్య, నాని తదితరులు పాల్గొన్నారు.