*💥💥ఫ్లాష్ .ఫ్లాష్*💥💥
*తిరుపతి*
*మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల ఎక్స్ గ్రెషియా తో పాటు వారి కుటుంబం లో ఒకరికి టిటిడి లో కాంట్రాక్టు ఉద్యోగం*
*💥తిరుపతిలో తొక్కిసలాట ఘటన పై CM సీరియస్*💥
*💥తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు టిటిడి జేఈవో గౌతమి తిరుపతి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ బదిలీ*💥
*👉డి.ఎస్.పి లు రమణబాబు, హరినాథ్ రెడ్డి ల సస్పెండ్*
*💥తిరుమల తొక్కిసలాట ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్న ముఖ్యమంత్రి*
*👉మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల ఎక్స్ గ్రెషియా తో పాటు వారి కుటుంబం లో ఒకరికి టిటిడి లో కాంట్రాక్టు ఉద్యోగం*
*👉తీవ్రంగా గాయపడిన రెండు కుటుంబాల వారికి ఒక్కొక్కరికి ఐదు లక్షలు*
*👉గాయాల పాలైన 32 మందికి ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా*
తిరుపతి తొక్కిసలాట ఘటన పై సమీక్షించేందుకు ఈ మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుపతికి చేరుకుని ఘటనా స్థలాలను పరిశీలించి ఆసుపత్రిలో ఉన్న బాధితులతో మాట్లాడి అనంతరం అధికారులతో సమీక్షించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు..ఈ మీడియా సమావేశం లో అనేక విషయాలపై చంద్రబాబు నాయుడు స్పందించారు, ఘటనకు బాధ్యులైన ఇద్దరు డీఎస్పీ లును సస్పెండ్ చేస్తూ, ముగ్గురు అధికారులు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అలాగే మృతి చెందిన వారి కుటుంబాలకు క్షతగాత్రులైన వారికి ఆర్థిక సాయం, ఉద్యోగం ప్రకటించారు, అలాగే వైకుంఠ ఏకాదశికి జారీ చేసే టోకెన్ల విషయంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు, వైకుంఠ ఏకాదశి,ద్వాదశి అని రెండు రోజులు మాత్రమే ఉంటాయని పది రోజులు ఎందుకు ప్రత్యేక టోకన్లు ఇస్తున్నారో అర్థం కావడం లేదని ఇది ఆగమన శాస్త్రం వాళ్ళు చూసుకుంటారని అలాగే క్షతగాత్రులతో మాట్లాడిన తర్వాత టిటిడి పాలనకు సంబంధించి అనేక విషయాలపై మార్పులు, సమీక్షలు జరగవలసిన అవసరం ఉందని ఘటన వెనుక కుట్రకోణం ఏమైనా ఉందా అనే కొనులకు కూడా విచారణ చేస్తామని పూర్తి విచారణకు జ్యుడీషియల్ ఎంక్వైరీ కి ఆదేశించామని టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు తో పాటు అనేకమంది ఇతర రంగాలు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన విభాగం లోకి వచ్చారని వారు కూడా మెరుగైన పాలన అందించేందుకు చర్యలు తీసుకోవాలని అనేక కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు…