*మినీ గోకులం షెడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి*

* పాడి రైతులకు చంద్రబాబు చేయూత.
* పల్లెలకు పూర్వ వైభవం దిశగా కృషి.

రైతుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. ఇందుకూరుపేట మండలం పాములవారి పాళెం గ్రామంలో ఆమె మినీ గోకులం షెడ్డు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ పాడి పంటలతో పల్లె సీమలకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్న సిఎం చంద్రబాబు నాయుడు డిప్యూటి సిఎం గార్లను కొనియాడారు. ఇందుకూరుపేట మండలంలో పాడి రైతులకు మినీ గోకులమిత్ర షెడ్లు మంజూరయ్యాయన్నారు. 90 శాతం సబ్సిడీ వచ్చే గోకులమిత్ర పధకాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం విస్మరించిన మినీ గోకులం షెడ్ల నిర్మాణాన్ని పునః ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ నాగేంద్రబాబు, ఇందుకూరుపేట టిడిపి మండల అధ్యక్షుడు వీరేంద్ర నాయుడు, సీనియర్ నాయకులు చెంచుకిషోర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed