ఆరోగ్యాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం.

యూనివర్సల్ హెల్త్ పాలసీ ను ఆమోదించిన రాష్ట్ర క్యాబినెట్ కు కృతజ్ఞతలు.

అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమైన మెరుగైన వైద్య పాలసీని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకురావడం శుభ పరిణామం.

మితిమీరిన వైద్య ఖర్చులు, భవిష్యత్తులో ఊహించని అనారోగ్య ఉపద్రవాల నుండి రక్షించే భీమా కవచమే యూనివర్సల్ హెల్త్ పాలసీ.

*- డాక్టర్ జెడ్ శివప్రసాద్, టిడిపి వైద్య విభాగం అధ్యక్షులు, ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఛైర్మన్.*

 

ప్రజలకు ఉచిత వైద్యం అందించే “యూనివర్సల్ హెల్త్ పాలసీ” పై విష ప్రచారానికి తెగబడటం వైసీపీ నేతలకే చెల్లింది.

కరోనా సమయంలో మందులు సరఫరా చేసిన కంపెనీలకు బిల్లులు చెల్లించలేని దీనస్థితికి రాష్ట్రాన్ని చేర్చి, రెడ్ మార్క్ ఘనత సాధించిన ఘనులు వైసీపీ నేతలు.

కరోనా కష్టకాలంలో మాస్క్ ఇవ్వలేక, పారాసెట్మాల్, బ్లీచింగ్ తో సర్దుకోమని నాటి వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేస్తే నోరు మెదపని వైసీపీ నేతలకు వైద్య విధానాల గురించి మాట్లాడే అర్హత లేదు.

మాస్క్ అడిగిన దళిత వైద్యులు సుధాకర్ ను పొట్టన పెట్టుకుని, ఆసుపత్రులపై, వైద్య సిబ్బంది పై దాడులకు, దౌర్జన్యాలకు తెగబడిన విషసంస్కృతి వైసీపీ కే సొంతం.

ప్రత్యేక పరిస్థితుల్లో సాయపడే ముఖ్యమంత్రి సహాయనిధిని అటకెక్కించి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు 4వేల కోట్ల బకాయిలను పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వం దే.

*- డాక్టర్ జెడ్ శివప్రసాద్, టిడిపి వైద్య విభాగం అధ్యక్షులు, ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఛైర్మన్.*

తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నందు ఈరోజు(06/09/25) మధ్యాహ్నం టిడిపి వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్ గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డా. జడ్ శివప్రసాద్ గారు మాట్లాడుతూ…..

రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు,2493 ఆసుపత్రుల్లో, 31 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో నిర్వహించే 3257 రకాల చికిత్సలు యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా పూర్తిగా ఉచితం.

ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతీ కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించడమే యూనివర్సల్ హెల్త్ పాలసీ లక్ష్యం.

హైబ్రిడ్ మోడ్ లో భీమా సంస్థల ద్వారా నగదు రహిత వైద్య సేవలను రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

రానున్న దశాబ్దకాలంలో రాష్ట్ర, దేశవ్యాప్తంగా అనేక అంటువ్యాధులు, జబ్బులు గణనీయంగా పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు చూపుతో చంద్రబాబు గారు ఈ పాలసీకి శ్రీకారం చుట్టారు.

ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి ఊహించని అనారోగ్యముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గొప్ప పాలసీ ను అందుబాటులో తేవడం హర్షణీయం.

రాష్ట్ర ప్రజల ఆరోగ్యరక్షణ అంశంలో చంద్రబాబు గారు రాజీ పడరు. వారి చారిత్రాత్మక నిర్ణయంతో రాష్ట్రంలో కొత్త వెలుగులు చూడబోతున్నాం.

కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలోని చిట్టచివరి ఇంటికి సైతం ఆరోగ్య ధీమా, భీమా అందనుంది.

రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం ను అందించేందుకు విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.

యాంటిబయోటిక్స్, మందులకు లొంగని బ్యాక్టీరియాలు తీవ్ర రూపం దాల్చి, వ్యాధుల రూపంలో చుట్టుముట్టి, ప్రజల జేబులకు చిల్లులు పెట్టి, వారిని రోడ్డు పాలు కానీకుండా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తోంది.

రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాంక్షించి, ఏడాదికి రూ.641.07 కోట్ల ఆర్థిక భారం ను కూటమి ప్రభుత్వం భరించనుంది.

ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అమలు కానున్న ఈ ఆరోగ్య విధానం తో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది.

కూటమి ప్రభుత్వం తీసుకున్న నూతన వైద్య విధానం ద్వారా రాష్ట్ర ప్రజలు పేద, ధనిక అన్న తేడా లేకుండా ఉచిత వైద్యం పొందనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ 8480 కోట్ల అంచనాతో నివేదిక ఇచ్చి, 4948 కోట్ల నాబార్డు, సీఎస్ఎస్, కేంద్ర ప్రత్యేక నిధులను పొంది, 1451 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేసి 25% పనులు చేయకుండా చేతులెత్తేసింది నాటి వైసిపి ప్రభుత్వం.

పి పి పి విధానం ద్వారా 10 మెడికల్ కళాశాలల నిర్మాణం, నిర్వహణ… వాటికి అనుబంధంగా ఆసుపత్రులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం శుభ పరిణామం.

తద్వారా విద్యా బోధన, మెరుగైన వసతులు, వనరులు, భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా వైద్య కళాశాలలు సిద్ధమవుతాయి.

రాష్ట్రానికి మంచి జరిగే నిర్ణయం తీసుకున్నా, ప్రజలకు మేలు జరిగే పథకం తెచ్చినా వైసీపీ నేతలు తట్టుకోలేరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *