
*మానవత్వం చాటుకున్న మంత్రి నారాయణ*
*కూలిపోయిన ఇంటిని అతి తక్కువ కాలంలోనే పునర్నిర్మించి ఇచ్చిన మంత్రి*
*నెల రోజుల్లోనే పేదవాడికి సొంతింటి కల సాకారం*
*మంత్రి ఔదార్యం పట్ల సర్వత్రా హర్షం*
*ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన P4 విధానంతోనే పేదరిక నిర్మూలన..మంత్రి నారాయణ*
మంత్రి నారాయణ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు .ప్రమాదంలో కూలిపోయిన ఇంటిని సొంత నిధులతో పునర్నిర్మించి ఇచ్చి పేద మైనారిటీ కుటుంబానికి అండగా నిలిచారు .
మానవత్వాన్ని చాటుకున్నారు.
నెల్లూరు నగరంలోని 53వ డివిజన్ వారధి సెంటర్ వద్ద గతనెలలో ప్రమాదవశాత్తు డ్రైనేజీ ట్యాంకర్ ఢీకొని ఇల్లు కోల్పోయిన మౌలాలి కుటుంబానికి మంత్రి అండగా నిలిచారు .నెల రోజుల్లోనే కొత్త ఇంటిని నిర్మించి శుక్రవారం గృహప్రవేశం చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 ద్వారా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న 10 శాతం మంది అట్టడుగున ఉన్న 20 శాతం మందిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. పేదరికం నుండి విముక్తి పొందాలంటే నాణ్యమైన విద్యే మార్గమని, అందుకే నెల్లూరులోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయి కంటే మిన్నగా తీర్చిదిద్దుతున్నామని ఆయన స్పష్టం చేశారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మానవత్వం ఉన్న గొప్ప నాయకుడు మంత్రి నారాయణ అని, ఆయన మాట ఇస్తే తప్పరని కొనియాడారు. నెల రోజుల క్రితం 53వ డివిజన్ వారధి సెంటర్ షుగర్ ఫ్యాక్టరీ ప్రాంతంలో లారీ దూసుకెళ్లి ఇల్లు కోల్పోయిన పేద ముస్లిం మైనారిటీ కుటుంబానికి, మంత్రి తన సొంత నిధులతో కేవలం నెల రోజుల్లోనే పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారని తెలిపారు. రాజకీయాల్లో ఇలాంటి నిబద్ధత గల నాయకులు అరుదుగా ఉంటారని, ఆపదలో ఉన్న పేదవాడికి నీడ కల్పించిన మంత్రి నారాయణ గారిని నెల్లూరు ప్రజలందరూ ఆశీర్వదించాలని ఈ రూప్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు… ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ ,మేయర్ సుజాత అశోక్ ,టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు విజేతా రెడ్డి ,నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ,టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి స్థానిక టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.