
*మహిళా మహిళల సాధికారత దిశగా కూటమి ప్రభుత్వ పాలన*
– లైంగిక వేధింపులు, హింసకు వ్యతిరేకంగా మహిళలకు రక్షణ.
– మహిళలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుగా పోస్టులు చేస్తున్న వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు.
– ఉచిత బస్సులో వృద్ధ మహిళల కోసం ప్రత్యేకంగా ఒక సీటు కేటాయింపు.
– పాఠశాలలు, కళాశాలల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి చేయాలి.
– వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలపై పర్యవేక్షణ.
– మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాసనసభ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
మహిళలకు స్వయం ఉపాధి కల్పన మరియు మహిళా ప్రశ్రామికవేత్తలకు ప్రతేక ప్రోత్సాహకాలు.
అందచేసి మహిళల సాధికారతకు కృషి చేయాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధాని అమరావతిలోని శాసనసభ కమిటి హాలులో నిర్వహించిన సమావేశంలో ఆమె మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాసనసభ కమిటీ సభ్యురాలి హోదాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు కోవూరు నియోజకవర్గ పరిధిలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, కార్యాచరణ గురించి వివరించారు. అనంతరం మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాసనసభ కమిటీ చైర్మన్, పాణ్యం నియోజకవర్గం శాసన సభ్యురాలు గౌరు చరిత రెడ్డి గారి అధ్యక్షతన ఉచిత బస్సులో వృద్ధ మహిళల కోసం ప్రత్యేకంగా ఒక సీటు కేటాయింపు, ప్రతి పాఠశాల, కాలేజీల్లో మహిళల కోసం డిస్పెన్సరీలు మహిళల స్వయం ఉపాధి తదితర అంశాలపై చర్చించారు.
సోషల్ మీడియాలో మహిళలపై తప్పుగా పోస్టులు చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి ఫిర్యాదులు నమోదు చేయాలని, వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని తీర్మానించారు.
మహిళలు, పిల్లల భద్రత కోసం రౌండ్ ద క్లాక్ కమాండ్ సెంటర్లు మరియు ఉమెన్ ట్రాఫికింగ్ పై యాంటీ ట్రాఫికింగ్ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
పాఠశాలలు, కళాశాలల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి చేయాలని,ల రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, దేవాలయాలు వంటి ప్రదేశాల్లో వృద్ధులు, వికలాంగుల కోసం వీల్ చైర్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు సూచించారు. .
ప్రభుత్వ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాల ఏర్పాటు. ప్రైవేట్ వృద్ధాశ్రమా అనాథాశ్రమాలపై పర్యవేక్షణ చేసేలా ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.
ఈ సమావేశంలో మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో పాటు మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాసనసభ కమిటీ నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యురాలు
గల్లా మాధవి, ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ ఎమ్మెల్సీలు కావలి గ్రీష్మ ప్రసాద్, A. మధుసూదన్, T. కల్పలత తదితరులు పాల్గొన్నారు.