
*మహిళలకు ఆత్మ రక్షణ ఎంతో అవసరం :- Sk. మాబు, జిల్లా అధ్యక్షులు, RPI (A) SPSR నెల్లూరు జిల్లా కమిటీ.*
నెల్లూరు (జన హుషార్)01 మార్చి : నెల్లూరు నగరంలో పుర మందిరంలో “సృజన” సంస్థ వారు నిర్వహించిన, మహిళా శక్తి కార్యక్రమంలో, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబెడ్కర్ )తరపున, మహిళలకు ఆత్మ రక్షణ ఎంత అవసరం అనే విషయం మీద rpi రాష్ట్ర నాయకులు అయినటువంటి మహిళా విభాగం కన్వీనర్ కొప్పోలు ప్రమీల, రాష్ట్ర నాయకులు చిట్టేటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో, ప్రఖ్యాతి కరాటే మాస్టర్ ఆదినారాయణ సమక్షంలో , మహిళలకు ఆత్మ రక్షణ విషయంలో కరాటే యొక్క ప్రాముఖ్యత గురించి ఒక చిన్న స్క్రిప్ట్ (డ్రామా )చేయడం జరిగింది.
ఈ స్క్రిప్ట్ కు ముద్దులైనటువంటి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మేకపాటి శాంతి కుమారి , పలువురు పుర ప్రముఖులు. ఈ సందర్భంగా RPI(A) నెల్లూరు జిల్లా అధ్యక్షులు SK. మాబు ఈ కార్యక్రమంలో పాల్గొని చివరి వరకు వీక్షించి, నేటి సమాజంలో మహిళల యొక్క అభ్యున్నతి మహిళల యొక్క ఎదుగుదలను కొనియాడారు. ఈ తరుణంలో మహిళలకు అవసరమైనటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ,వ్యక్తిగత భద్రత కొరకు కరాటి అనేది ఎంతో అవసరం అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో RPI జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టపు రంగారావు తొ పాటు జిల్లా నాయకులు వాటంబేటీ నాగేంద్ర, మైనార్టీ విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆర్ధిక బేగం, దీపు తదితరులు పాల్గొన్నారు.