*మహానాడు నిర్వహణపై నేతలతో ఎంపీ వేమిరెడ్డి భేటీ*

కడప మహానాడు ఏర్పాట్లపై నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు, మహానాడు సమన్వయ కమిటీ, ఆర్థిక కమిటీ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నేతలతో భేటీ అయ్యారు.

సోమవారం కడపలోని ఆర్‌అండ్‌ బి అతిథి గృహంలో రాష్ట్ర పురపాలక శాఖమంత్రి పొంగూరు నారాయణ గారు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌గారు, విజయభాస్కర్‌రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ రూప్‌ కుమార్‌ యాదవ్‌, ఇతర నాయకులు తదితరులతో కలసి మహానాడు ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు.

రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కల్పించాల్సిన వసతులు, ఏర్పాట్లు, ఇతర అంశాలపై మాట్లాడారు. అలాగే నెల్లూరు నుంచి వచ్చే వారికోసం తీసుకోవాల్సిన అంశాలపై మాట్లాడారు. ఎక్కడా ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి …రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తో కూడా ప్రత్యేకంగా మాట్లాడి ఏర్పాట్లపై వివరాలు ఆరా తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed