*మహానాడు ఏర్పాట్ల పరిశీలనలో ఎంపీ వేమిరెడ్డి*
కడపలో రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, మహానాడు సమన్వయ కమిటీ, ఆర్థిక కమిటీ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
కడపలో మహానాడు నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను సోమవారం ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. సభా ప్రాంగణంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో ఏర్పాట్లపై చర్చించారు. ప్రధాన వేదిక వద్ద చేపట్టిన పనులను పరిశీలించి పలు సూచనలు అందజేశారు.
చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు నిర్వహించాలని ఆయన సూచించారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక నాయకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఏర్పాట్ల పరిశీలనలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, బెజవాడ వంశీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.