*మలిరెడ్డికి ఆదాల పరామర్శ*
ప్రముఖ సీనియర్ న్యాయవాది మలిరెడ్డి శ్రీనివాసులురెడ్డిగారిని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు పరామర్శించారు. ఈ మేరకు శుక్రవారం నెల్లూరు నగరంలోని ఫతేఖాన్ పేటలోని శాంతినగర్ లో న్యాయవాది మలిరెడ్డి శ్రీనివాసులురెడ్డిని కలిసి ఆయన ఆరోగ్య యోగక్షమాలను మాజీ ఎంపీ ఆదాల అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి సీనియర్ నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి ఉన్నారు. మలిరెడ్డి శ్రీనివాసులురెడ్డిని పరామర్శించిన వారిలో నెల్లూరు విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్ణ వెంకయ్య పాశం శ్రీనివాస్, యేసు నాయుడు, సిహెచ్ హరిబాబు యాదవ్, మల్లు సుధాకర్ రెడ్డి, షేక్ హంషిద్ ఆలీ, కొండేటి నరసింహారావు, కల్లూరు లక్ష్మీరెడ్డి, షేక్ మొయిద్దీన్, పాతపాటి ప్రభాకర్, బెల్లంకొండ వెంకయ్య, నాని తదితరులు పాల్గొన్నారు.