*మద్దతు ధర కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ధాన్యం సేకరించడంలోనూ తీవ్ర అన్యాయం జరుగుతుందని* *రైతాంగాన్ని ఆదుకోవాలని వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు నర్సోజికి వినతిపత్రం ఇచ్చిన: బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్*
మద్దతు ధర లేకుండా నష్టానికి రైతులు తమ పంటలను అమ్ముకుంటున్నారు.
నెల్లూరు జిల్లాలో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కానుంది.
జిల్లా *అధికారులు 11 లక్షలు మెట్రి క్ టన్నులు ధాన్యాన్ని మాత్రమే సేకరించాలని నిర్ణయించారు*.
అధికార _అనధికారికంగా జిల్లాలో600000 ఎకరాలకు పైగా వరి సాగు బడి జరిగింది
సివిల్ సప్లైస్ వారు 350000 ఎకరాలలో మాత్రమే ధాన్యం సేకరించాలని నిర్ణయించారు
గత రెండు మూడు సీజన్లలో బిపిటి 23000. కేఎన్ఎమ్ 24000 .ఆర్ఎన్ఆర్26000 రూపాయల చొప్పున పుట్టి ధాన్యాన్ని విక్రయించుకున్న రైతాంగం కు నేడు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదు .
బిపిటి రకం 16 _17 వేల మధ్య కెఎన్ఎమ్ 17_ 18 వేల మధ్య ఆర్ఎన్ఆర్ 18 _18 1/2వేల రూపాయలకు విక్రయించుకుంటున్నారు
అధికారిక ఆయకట్టు ఐదు లక్షలు ఎకరాలు కు ఈ క్రాప్ నమోదయి ఉంటే అందులో 3.5 లక్షలు ఎకరాలులో మాత్రమే ధాన్యం సేకరణ అమలవుతుంది
అనధికార ఆయకట్టు చెరువులు _వాగులు _పోరంబోకులు వంకలలో_ రైతులుసాగుచేసిన లక్ష ఎకరాలు ఈ క్రాప్ లో నమోదు చేయడం లేదు .
జిల్లాలో రెండున్నర లక్ష ఎకరాలలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేసే అవకాశం లేనందున రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. నెల్లూరు జిల్లాలో రైతాంగం పంటను ఎండబెట్టుకునేందుకు ప్లాట్ ఫారం లో లేనందున దళారులకు గిట్టుబాటు ధర కంటే తక్కువ రేటుకు విక్రయించుకుంటున్నారు మిల్లర్ల వద్ద డ్రైయర్లు సదుపాయం ఉన్నందున మిల్లర్లను ప్రభుత్వం ఒప్పించి తేమ శాతం తో సంబంధం లేకుండా రైతాంగం నష్టపోకుండా విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రమేష్ విజ్ఞప్తి చేశారు
గత టిడిపి ప్రభుత్వంలో *వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు అనధికారాయకట్టు రైతాంగం నష్టపోకుండా చర్యలు తీసుకున్నారు*. అలాంటి చర్యలను పునరుద్ధరించాలని మిడతల రమేష్ వ్యవసాయ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు
ఈ కార్యక్రమంలో నరాల సుబ్బారెడ్డి. అలీ రవి కుమార్ యాదవ్. కంచర్ల నారాయణ యాదవ్. సిహెచ్ కాలంగి సుబ్బారావు. నారాయణరావు పి ప్రశాంత్ లు పాల్గొన్నారు