
*మంత్రి నారాయణ చొరవ -నెల్లూరు రూరల్ స్కూల్స్ కు మహర్దశ*
*ప్రభుత్వ బడులకు కార్పొరేట్ కళ*
*5 కోట్లతో మోడల్ స్కూల్‌గా పొదలకూరు రోడ్డులోని గర్ల్స్ హైస్కూల్*
*విఆర్సీ తరహాలో రూరల్ పాఠశాలల ఆధునీకరణ*
*ఏప్రిల్ 15 నుంచి స్కూల్స్
రీ-మోడలింగ్ పనులు*
*లోకేష్ విజన్.. నారాయణ యాక్షన్.*
*నెల్లూరు విద్యావ్యవస్థలో సరికొత్త విప్లవం*
నెల్లూరు రూరల్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై మంత్రి నారాయణ ద్రుష్టి పెట్టారు .
సిటీ తరహాలోనే రూరల్ విద్యావ్యవస్థలో
సరికొత్త విప్లవం సృష్టించబోతున్నారు.యువనేత లోకేష్ విజన్ కి అనుగుణంగా ముందుకు దూసుకు పోతున్నారు .
మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన మాట ప్రకారం పొదలకూరు రోడ్డులోని ప్రభుత్వ బాలికల హైస్కూల్‌ను క్షేత్రస్థాయిలో మంత్రి నారాయణ పరిశీలించారు .విద్యాశాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు .రూ. 5 కోట్ల భారీ వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. యువనేత లోకేష్ విజన్‌కు అనుగుణంగా కార్పొరేషన్ పరిధిలోని అన్ని స్కూళ్లను మూడేళ్లలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మారుస్తామన్నారు .ఏప్రిల్ 15 నుంచే ఈ ఆధునీకరణ పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభమవుతాయని మంత్రి స్పష్టం చేశారు.
ఈ మహత్కార్యానికి CSR నిధులతో సహకరిస్తున్న ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ యాజమాన్యాన్ని అభినందించారు.త్వరలోనే పేద విద్యార్థులకు మంత్రి లోకేష్ చేతుల మీదుగా నారాయణ విద్యాసంస్థల తరపున సైకిళ్ల పంపిణీ చేపడతామని ప్రకటించారు. అనంతరం ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ పరిధిలోని గణేష్ ఘాట్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మిస్తున్న సి.సి రోడ్డు పనుల నాణ్యతను తనిఖీ చేసి పనుల్లో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు.
పల్లో వేగం పెంచి వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రాజధాని నిర్మాణంలో బిజీగా ఉన్నా, తన నియోజకవర్గ అభివృద్ధిని మంత్రి నారాయణ సార్ పరుగులు పెట్టిస్తున్నారు అని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కొనియాడారు.
ఇచ్చిన మాటప్రకారం రూరల్ లోని స్కూళ్ల అభివృద్ధిపై ద్రుష్టి పెట్టిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ ,జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావు ,మేయర్ సుజాత అశోక్ ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు విజేతా రెడ్డి ,నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ,మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ ,టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి ,రూరల్ టీడీపీ నేతలు పాల్గొన్నారు .