*మంత్రి నారా లోకేష్ గారి సారధ్యంలో ప్రభుత్వ విద్యకు పూర్వ వైభవం*
– డ్రాపౌట్స్ నివారించండి.
– విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల కేటాయింపు.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ప్రాధమిక విద్యా విధానం గందరగోళానికి గురైందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన 117 జీవో ఉపసంహరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని విపిఆర్ నివాసంలో విద్యాశాఖ అధికారులతో విద్యా ప్రగతి పై సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త విధానంలో ఐదు రకాల పాఠశాలలను ప్రతిపాదనలపై చర్చించారు. గత ప్రభుత్వంలో ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన 3, 4, 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు వెనక్కి తీసుకొచ్చే విషయమై విద్యాశాఖ అధికారుల అభిప్రాయం కోరారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6-8 తరగతుల విద్యార్థుల సంఖ్య 30, అంతకంటే తక్కువగా ఉంటే సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసి, దాన్ని ప్రాథమిక పాఠశాలగా మార్చాలని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు సూచించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త విధానంలో ఐదు రకాల పాఠశాలలు శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్, బేసిక్ ప్రైమరీ స్కూల్, మోడల్ ప్రైమరీ స్కూల్ ల విధి విధానాల ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావుతో, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డితో పాటు కోవూరు, బుచ్చిరెడ్డి పాళెం, విడవలూరు, కొడవలూరు మరియు ఇందుకూరు పేటకు సంబంధించిన మండల విద్యా శాఖాధికారులు పాల్గొన్నారు.