*భవనాల అసెస్మెంట్ డిమాండ్లను తనిఖీ చేసి, భవనానికి ఉన్న టౌన్ ప్లానింగ్ అనుమతులు, భవనం కొలతలు వేసి సరిపోల్చిన కమిషనర్ వై ఓ నందన్*

 

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం స్థానిక 12/3 ధనలక్ష్మిపురం, వావిలేటిపాడు ప్రాంతాలలో అధికారులతో కలిసి పర్యటించారు.

స్థానికంగా ఉన్న కొన్ని భవనాల అసెస్మెంట్ డిమాండ్లను తనిఖీ చేసి, భవనానికి ఉన్న టౌన్ ప్లానింగ్ అనుమతులు, భవనం కొలతలు వేసి సరిపోల్చారు.

ప్రతి ఒక్క ఆస్తిని పన్ను పరిధిలోకి తప్పనిసరిగా తీసుకురావాలని రెవెన్యూ అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఖాళీ స్థలం పన్నులను 100% వసూలు చేయాలని, నూతనంగా నిర్మిస్తున్న అన్ని భవనాలకు ఖాళీ స్థలం పన్ను, పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు తప్పనిసరిగా ఉండేలా పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.

అన్ని వ్యాపార వాణిజ్యాలకు ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరిగా ఉండేలా పరిశీలించి, ప్రతి ఒక్కరు ట్రేడ్ లైసెన్స్ తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.

పౌరులు బాధ్యతగా చెల్లించే పన్నులతోనే నగర వ్యాప్తంగా మౌలిక వసతులు, అభివృద్ధి పనులను చేపట్టగలమని, నిర్దేశించిన సమయానికి పన్నులు చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కమిషనర్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ అనిల్ కుమార్, రెవెన్యూ విభాగం అధికారి శ్రీనివాసులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవి, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed