*బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడే ఫర్టిలైజర్ షాప్స్ సీజ్ చేయండి : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి*

– ఫర్టిలైజర్ షాప్ లను నిరంతరం తనిఖీ చేయండి.
– బ్యాంకర్స్ తో మాట్లాడి క్రాప్ లోన్స్ విషయంలో రైతులకు సహకరించండి.
– పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా రైతులతో మమేకం కండి.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అధిక దిగుబడి సాధించేందుకై ఆధునిక పంట సాగు పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లోని విపిఆర్ నివాసంలో ఆమె వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. క్రాప్ ఇన్సూరెన్స్ పై అవగాహన కల్పించి ప్రతి రైతు ఇన్సూరెన్స్ చేసుకొనేలా చొరవ తీసుకోవాలని కోరారు. రైతులకు అందుబాటులో వుంటూ పంట సాగుకు సంబంధించి సూచనలు సలహాలు యివ్వవలసిందిగా సూచించారు. ఆయకట్టు పరిధిలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు కృషి చేయాలన్నారు. చాలా చోట్ల రైతులకు యూరియా అందుబాటులో లేదని మీడియాలో తరచూ వార్తలు వస్తున్నాయి. కోవూరు ప్రాంత రైతాంగ అవసరాలను దృష్టిలో వుంచుకొని యూరియా కొరత రాకుండా చూడాలన్నారు. ఫర్టిలైజర్ షాప్ లను నిరంతరం తనిఖీలు చేస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మరియు ఇతర పనిముట్లు అందించేలా చూడాలని ఆదేశించారు. ఎక్కడైనా ఎరువులు, విత్తనాలు ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వస్తే సంబంధిత షాపులలో ఆకస్మిక తనిఖీలు చేసి వారిపై చట్టపర చర్యలు తీసుకోవాలన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లో వ్యవసాయ పరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వార్షిక వృద్ధి రేటు 15 శాతం లక్ష్యానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మండలానికో డ్రోన్ పధకంలో సాంకేతిక పరిజ్ఞ్యానం పై అవగాహన వున్న అర్హులైన రైతులను ఎంపిక చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు వ్యవసాయ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారులు పి సత్యవతి, నర్సోజి రావు, లతో పాటు మండల వ్యవసాయ అధికారులు రాజకుమార్, సుజాత, ఇంద్రావతి, లక్ష్మి, క్రిష్ణయ్య , సురేందర్ రెడ్డి మరియు రాఘవేంద్ర రెడ్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *