బాలాజీ నగర్ లో నూతన టెంపో స్టాండ్ ప్రారంభించిన బిజెపి జిల్లా అధ్యక్షులు
నెల్లూరు నగరం, బాలాజీ నగర్ లో బిజెపి మండల అధ్యక్షులు మింగా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపి సెంటర్ నందు (BJMM) ఆదివారం నూతన టెంపో కారు టాక్సీ స్టాండ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు శిపారెడ్డి వంశీధర్ రెడ్డి స్టాండ్‌ను ప్రారంభించ అనంతరం మీడియాతో, మాట్లాడుతూ,
టెంపో స్టాండ్ వల్ల ప్రజలకు రవాణా సౌలభ్యం అందుబాటులోకి రావడంతో పాటు, డ్రైవర్లు, మెకానిక్‌లు, ఇతర కార్మికులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయనీ, బాహ్య ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు సులభంగా వాహనాలు లభిస్తాయి అన్నారు..
ప్రజలు రవాణా కోసం వేచిచూడాల్సిన అవసరం లేకుండా, సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అదనంగా, అధికారికంగా గుర్తింపు పొందిన స్టాండ్ కావడంతో ప్రయాణ భద్రత కూడా మెరుగవుతుందనీ అన్నారు
ఈ కార్యక్రమంలో స్టాండ్ అధ్యక్షులు రంగా రావు, ముక్కు రాధాకృష్ణ గౌడ్, P. మనోహర్, గురు ట్రావెల్స్ హరి కుమార్, మల్లిఖార్జున, మండల నాయకులు, స్టాండ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.