ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం
నెల్లూరు టు బద్వేల్ గ్రీన్‌ఫీల్డ్ హైవేకు కేంద్ర ఆమోదం రూ.3,653 కోట్లు ఖర్చుతో 108 కిలోమీటర్ల జాతీయ రహదారి
బీజేపీ జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్
నెల్లూరు, మే 30:
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు రోడ్ నుంచి కడప జిల్లా బద్వేల్ వరకు నాలుగు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం కానుందనీ ,బీజేపీ నెల్లూరు జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు, ” నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి గట్టి పునాది వేస్తుందనీ,. ప్రాజెక్టును ఆమోదించిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కమిటీకి, ముఖ్యంగా ఈ అభివృద్ధికి బాటలు వేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు.
“విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్లతో కలిపి నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా తిరుగులేని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందనీ ,సాగరమాల ప్రాజెక్టు, గ్రీన్ సిటీ అభివృద్ధితో పాటు ఇప్పుడు ఈ హైవే ప్రాజెక్టు జిల్లా భవిష్యత్తును మార్చనుందని,. ఇది ప్రధానమంత్రి మోదీ గారి దూరదృష్టికి నిదర్శనం” అని పేర్కొన్నారు.
ఈ జాతీయ రహదారి మొత్తం రూ.3,653 కోట్లు తో ,108.13 కిలోమీటర్ల మేరకు ఉంటుందని, డిజైన్-బిల్డ్-ఫైనాన్స్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్‌ఓటీ) పద్ధతిలో నిర్మించనున్నారు. మను బోలు, పొదలకూరు, చేజర్ల, అనంతసాగరం, మర్రిపాడు మండలాల మీదుగా హైవే నిర్మాణం జరుగనుందన్నారు.ఇప్పటి వరకు కృష్ణపట్నం పోర్టు నుంచి బద్వేల్ వరకు ప్రయాణం 142 కిలోమీటర్లు ఉండగా, కొత్త హైవేతో అది 108 కిలోమీటర్లకు తగ్గనుంది. ముంబయి హైవేపై ట్రాఫిక్ భారాన్ని తగ్గిస్తూ ప్రమాదాల సంఖ్యను కూడా తగ్గుతుందని ,రహదారి నిర్మాణంతో దాదాపు 20 లక్షల పనిదినాల ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.