*ప్రధానమంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ యోజన (PM-AJAY) కింద పొదుపు గ్రూపుల్లోని ఎస్సీ సభ్యులకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
ఒక్కో యూనిట్ విలువ రూ.2 లక్షలు, 10 శాతం లబ్ధిదారుల వాటా, రూ.50 వేలు సబ్సిడీ..ఏ యూనిట్ అయినా పెట్టుకునే అవకాశం
ప్రతి మండలంలో మూడు గ్రూపులకు రుణాల మంజూరు
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎస్సీ, బీసీ కార్పొరేషన్లతో పాటు ఐటీడీఏలను అలంకారప్రాయంగా మిగిల్చారు
ప్రభుత్వ శాఖలతో పాటు పథకాలను మూలనపెట్టి జగన్ రెడ్డి ఈ రోజు ఫలితం అనుభవిస్తున్నాడు
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని కార్పొరేషన్ల పరిధిలో సబ్బిడీ లోన్ల పంపిణీ తిరిగి ప్రారంభమైంది
ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలన్నీ తిరిగి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి
ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని లబ్ధిదారులకు సూచిస్తున్నాను.