📍 *REVISED*
*ప్రతిపక్ష హోదా విషయంలో సుప్రీం కోర్టు ఎప్పుడో క్లారిటీ ఇచ్చింది*
*అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించిన అంశంపైనే తిరిగి పిటీషన్ వేయడం సబబేనా*
*జగన్ రెడ్డి విషయంలో స్పీకర్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి*
*వైసీపీ ప్రభుత్వంలో 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చామనడం హాస్యాస్పదం*
*సామాజిక పింఛన్ల గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదు*
*అసెంబ్లీకి ఎగ్గొట్టి ప్యాలెస్ లో పచ్చి అబద్ధాలతో గడిపేస్తున్నాడు*
*గత ఐదేళ్లూ జగనన్న జల్సా పథకాలు…జగనన్న టోకరా పథకాలు..జగనన్న పేకమేడలే*
*అమరావతి: అసెంబ్లీ మీడియా పాయింట్ లో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
జగన్ రెడ్డి ప్రతిపక్ష హోదాపై మాట్లాడటం, హైకోర్టును ఆశ్రయించడం, స్పీకర్ కు హైకోర్టు నోటిసులిచ్చినట్టు వైసీపీ మీడియాలో ప్రసారం చేయడంపై శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు ఒక రూలింగ్ ఇచ్చారు
వీటన్నింటిని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలి..కానీ జగన్మోహన్ రెడ్డిని క్షమించి, నిర్ణయాన్ని శాసనసభ్యులకు వదిలేస్తున్నట్లు ప్రకటించారు
మేమంతా ప్రివిలేజ్ కమిటీ వేసి ఒక నిర్ణయం తీసుకోవాలని కోరాం..నిర్ణయం స్పీకర్ దే
ప్రతిపక్ష హోదా విషయంలో జగన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు..ఇంతకంటే తెలివితక్కువ నిర్ణయం మరొకటి లేదు.
2014లో ఏర్పడిన లోక్ సభలో 10 శాతం సీట్లు రాకపోయినా ప్రతిపక్ష హోదా కావాలని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు..
రాహుల్ గాంధీ వినతిని అప్పట్లోనే సుప్రీంకోర్టు తిరస్కరించింది
అత్యున్నత న్యాయ స్థానంలో ఒకసారి తిరస్కరించిన తర్వాత అదే అంశంపై హైకోర్టును ఆశ్రయించడం సబబేనా
పి.జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చారంటూ ఒక పచ్చి అబద్ధం చెప్పారు
స్పీకర్ స్థానాన్ని గౌరవించే పరిస్థితిలో వైసీపీ నాయకుడు లేరు
జగన్మోహన్ రెడ్డి విషయంలో స్పీకర్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సభ్యులందరం కోరుతున్నాం
వైసీపీ హయాంలో 40 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఈ రోజు మీడియా ముందు జగన్ రెడ్డి చెప్పారు
రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది జనాభాలో మైనర్లు, విద్యార్థులు పోను 4 కోట్ల మంది ఉంటారు..
అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే రాష్ట్ర జనాభాలో 10 శాతం మందికి ఉద్యోగాలు ఇచ్చేశారా
గత ఐదేళ్ల పాలనలో అనేక పరిశ్రమలను బెదిరించి తరిమేసిన జగన్ రెడ్డి మా కూటమి ప్రభుత్వం బెదిరిస్తోందని చెప్పడం హాస్యాస్పదం
అమర్ రాజా అనుబంధ సంస్థ రాష్ట్రం వదిలి ఎందుకు వెళ్లిపోయింది..కియా విస్తరణ ఏపీలో ఎందుకు జరగలేదు
కృష్ణపట్నం పోర్టులో ఎగుమతులు, దిగుమతుల్లో కీలకమైన కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకు ఎందుకు వెళ్లిపోయింది
ఈ పరిశ్రమలన్నీ ఎవరు బెదిరిస్తే వెళ్లిపోయాయి
అసెంబ్లీకి ఎగ్గొట్టి ప్యాలెస్ ల్లో కూర్చుని పచ్చి అబద్ధాలు చెప్పడం దురదృష్టకరం
ప్రతిపక్షహోదా అంశంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కనీస అవగాహన లేకుండా ఒక పార్టీకి ఎలా నాయకత్వం వహిస్తావ్
సామాజిక పింఛన్లపైనా నోటికొచ్చిన లెక్కలు చెప్పారు
మొదట సామాజిక పింఛన్ ను రూ.30తో ఎన్టీఆర్ ప్రారంభించారు..ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రూ.70కి పెంచారు
రూ.70 నుంచి రూ.200కి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పెంచితే, రూ.200 పింఛన్ ను రూ.1000కి పెంచింది చంద్రబాబు నాయుడు
తిరిగి ఆ రూ.1000 పింఛన్ ను రూ.2 వేలకు పెంచిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుదే
రూ.2000 ను రూ.3 వేలు చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్లు పట్టింది. ఏటా రూ.500 చొప్పున వాయిదాల పద్దతి పాటించారు
మొన్న చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అయ్యాక రూ.3 వేలు పింఛన్ ను ఒకేసారి రూ.4 వేలకు పెంచారు
రూ.4 వేలలో రూ.1170ని జగన్ రెడ్డి, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డితో పాటు మిగిలిన కాంగ్రెస్ సీఎంలు ఇస్తే, రూ.2830 తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ఇచ్చారు
పింఛన్ల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడిది
అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ మాట్లాడుతూ ఈ రోజుకి రాష్ట్రంలో ఇన్వెస్టర్లు 6.50 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారని, తద్వారా 4 లక్షల ఉద్యోగాలు వస్తాయని క్లియర్ గా చెప్పారు..
4 లక్షల ఉద్యోగాలు కూటమి ప్రభుత్వం ఇచ్చేసినట్టు చెప్పుకుందని జగన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారు.
ఒక మాజీ సీఎంకి, చట్టసభ సభ్యుడికి ఉండాల్సిన లక్షణాలు జగన్మోహన్ రెడ్డికి లేవు
గత ఐదేళ్లు ఆయన రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి ఆర్థిక కష్టాలు మిగిల్చినా మా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది
2019 ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం, ప్రత్యేక హోదా, పోలవరం, వారంలో సీపీఎస్ రద్దు, ఏటా జాబ్ కాలెండర్ ప్రకటన, ఏటా డీఎస్సీ నిర్వహణతో టీచర్ పోస్టుల భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు..
తీరా అధికారంలోకి వచ్చాక ఇవన్నీ వదిలేసి జగనన్న జల్సా పథకాలు..జగనన్న టోకరా పథకాలు..జగనన్న పేకమేడలతో సరిపెట్టుకున్నాడు
అసెంబ్లీకి వచ్చే దమ్ము లేక ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి పచ్చి అబద్ధాలు చెప్పుకోవడం దుర్మార్గం
ఇలాంటి వ్యవహారాలతోనే రాష్ట్ర ప్రజలు మొన్నటి ఎన్నికల్లో వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారు
ఎన్ని ఆర్థిక కష్టాలున్నా మా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నాం