
*ప్రతి రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ వసూళ్ల కొరకు ప్రణాళికను సిద్ధం చేసుకుని రెవెన్యూ వసూళ్లకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించవలసినదిగా ఆదేశించిన కమిషనర్ వై ఓ నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ వారాంతకు సమీక్షా సమావేశంలో భాగంగా రెవెన్యూ సిబ్బందితో కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో భాగంగా పబ్లిక్ సర్వీసెస్ రిక్వెస్ట్లు నిర్దేశించిన సమయం లోపల పూర్తి చేయవలసినదిగా ఆదేశించారు.
ఇంకా రెండవ అర్ధ సంవత్సరం ముగింపు వంద రోజులు మాత్రమే ఉన్నదని కావున రోజు కోటి రూపాయలు రెవిన్యూ కలెక్షన్లు వచ్చేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.
రెవెన్యూ సిబ్బంది అందరూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు పూర్తి చర్యలు చేపట్టవలసినదిగా ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే ప్రతి కార్యదర్శి వారి వారి సచివాలయ పరిధిలో రోజు 20 నుంచి 30 మంది బకాయిదారులను గుర్తించి పన్నులు రాబట్టేందుకు తగిన చర్యలు తీసుకోవలసినగా సూచించారు.
అలాగే ప్రతి రెవెన్యూ సిబ్బంది తర్వాతి రోజు రెవెన్యూ వసూళ్ల కొరకు ప్రణాళికను సిద్ధం చేసుకుని రెవెన్యూ వసూళ్లకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించవలసినదిగా ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, టిపిఆర్ఓ వాసు బాబు, రెవిన్యూ ఆఫీసర్లు సమద్, శ్రీనివాసులు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగర పాలక సంస్థ.