
*పేదోళ్ల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం*
– చిన్న పడుగుపాడు ఎన్టీఆర్ నగర్ లే అవుట్ లో పక్కా గృహాల ప్రారంభోత్సవం.
– రాష్ట వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి పేదోళ్ల సొంతింటి కల సాకారం చేసిన సిఎం చంద్రబాబు నాయుడు.
– కూటమి ప్రభుత్వం అధికలారంలోనికి వచ్చాక కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా 2 వేల 15 పక్కా గృహ నిర్మాణాలు పూర్తి చేసాం,
– అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా పక్కా ఇళ్ళు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది ప్రభుత్వ సంకల్పం.
– కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా 8 వేల 160 మంది లబ్దిదారులకు త్వరలో ఇళ్ల పట్టాలు అందచేస్తాం.
– గత ప్రభుత్వ హయాంలో సౌకర్యాలు లేని సొంత స్థలాలలో లేఅవుట్లు వేసి ప్రజాధనం కొల్లగొట్టారు.
– ఎన్టీఆర్ నగర్ లే అవుట్ల లో తాగునీరు, రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక వసతులు కల్పించండి.
– గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల కారణంగా పేదల ఇళ్ల నిర్మాణం, ఇంటి స్థలాల మంజూరులో జాప్యం జరిగింది.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ముఖ్యమంత్రి వర్యు ugలు శ్రీ చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక
కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా 2 వేల 15 పేదల పక్కా గృహ నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. కోవూరు మండలం చిన్న పడుగుపాడు గ్రామంలోని ఎన్టీఆర్ నగర్ లే అవుట్లో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గారితో కలిసి నిర్మాణాలు పూర్తయిన 38 పక్కా ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం వేసిన లే అవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించి ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల కారణంగా పేదల ఇళ్ల నిర్మాణం, ఇంటి స్థలాల మంజూరులో జాప్యం జరిగిందన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం నేటి పక్కా ఇళ్ల ప్రారంభోత్సవంతో సాకారం అయిందన్నారు. చిన్న పడుగుపాడు ఎన్టీఆర్ లే అవుట్ లో పక్కా ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా వుందన్నారు. నూతన గృహ ప్రవేశం చేస్తున్న లబ్ధిదారులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. చిన్న పడుగుపాడు ఎన్టీఆర్ నగర్ లేఅవుట్లో సిసి రోడ్ల కోసం 10 లక్షలు కేటాయించినట్లు ఆమె పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా పక్కా ఇళ్ళు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది మన ప్రభుత్వ సంకల్పమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు.
నియోజకవర్గ వ్యాప్తంగా 98 “ఎన్టీఆర్ నగర్ లే అవుట్ల” లో 8 వేల 160 మంది లబ్దిదారులను ఎంపిక చేసామన్నారు. అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా, సురక్షితంగా ఉండాలన్నదే సిఎం చంద్రబాబు నాయుడు గారి సంకల్పమన్నారు. నియోజకవర్గంలోని ఎన్టీఆర్ నగర్ లే అవుట్ల లో తాగునీరు, రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక వసతులు కల్పించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు అధికారులను కోరారు. ఇల్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇళ్లు మంజూరు చేయించేందుకు కృషి చేయిస్తానన్నారు. గత ప్రభుత్వ హయాంలో సౌకర్యాలు లేని సొంత స్థలాలలో లేఅవుట్లు వేసి ప్రజాధనం కొల్లగొట్టారని ఆరోపించారు. వైసిపి పాలనలో విడవలూరు మండలం వావిళ్లలో గిరిజనుల పక్కా గృహాల నిర్మాణంలో కాంట్రాక్టర్లు పాల్పడ్డ మోసాన్ని ఆమె కలక్టర్ హిమాన్షు శుక్లా గారి దృష్టి తెచ్చారు. రాష్ట వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి పేదోళ్ల సొంతింటి కలను సిఎం చంద్రబాబు నాయుడు గారు సాకారం చేశారన్నారు. అనంతరం చిన్న పడుగుపాడు ఎన్టీఆర్ నగర్ లేఅవుట్లో పూల పుష్పరాణి, మత్స్య పద్మావతి, పోలిశెట్టి వెంకటమ్మ, గందెళ్ళ లక్ష్మి, పొన్నపూడి శాంతమ్మ అనే పక్కా గృహాల లబ్దిదారులకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఇళ్ల తాళాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ ప్రత్యూష, జిల్లా హౌసింగ్ పిడి వేణుగోపాల్, పెన్నాడెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, చిన్న పడుగుపాడు సర్పంచ్ లక్ష్మి ప్రసన్న,టిడిపి నాయకులు జెట్టి మదన్ కుమార్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, చెంబేటి పెంచలయ్య, బత్తల రమేష్, ఆవుల వాసు తదితరులు పాల్గొన్నారు.