*పెరిగన విద్యుత్ చార్జీలకు నిరసనగా.. కదం తొక్కిన వైసిపి శ్రేణులు : ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి*
*నెల్లూరు నగర నియోజకవర్గం లో సునామి లా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు.*
*పెరిగిన విద్యుత్ చార్జీలకు నిరసనగా.. కదం తొక్కిన వైసిపి శ్రేణులు*
*ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు వేల మంది వైసీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ.*
పెరిగిన విద్యుత్ చార్జీలకు నిరసనగా నెల్లూరు నగర నియోజకవర్గంలో *వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించిన.*పెరిగిన విద్యుత్ చార్జీలకు నిరసనగా.. కదం తొక్కిన వైసిపి శ్రేణులు*
*ఎమ్మెల్సీ.*వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
——————————-
నెల్లూరు మిని బైపాస్ రోడ్డు మహేశ్వరీ – పరమేశ్వరి కళ్యాణ మండపం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ & *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్* ఆధ్వర్యంలో *ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా* .. భారీ నిరసన ర్యాలీ జరిగింది.
ఈ ర్యాలీ లో *3 వేలకు మంది కి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజల పాల్గొని* *నల్ల రంగు దుస్తులు ధరించి.. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని.. నినాదాలు చేస్తూ కదం తొక్కారు .*
మినీ బైపాస్ రోడ్డులోని పూలే బొమ్మ మీదుగా.. మిలీనియం సబ్ స్టేషన్ వరకు.. *వైసిపి నాయకులు,కార్యకర్తలు.. లాంతర్లు చేత పట్టుకొని..ఉరి తాళ్ళు మెడకు తగిలించుకొని.. కూటమి ప్రభుత్వం పెంచిన కరెంట్ బిల్లులు చెల్లించలేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ..ముందుకు సాగారు* .
అనంతరం మిలీనియం సబ్ స్టేషన్ వద్దకు చేరుకొని.. *మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి.. ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు విద్యుత్ అధికారి గారికి వినతి పత్రం అందజేశారు* .
*పెరిగిన విద్యుత్ ఛార్జీలు.. ప్రజలకు పెను భారంగా మారాయని .. తక్షణమే వాటిని ఉపసంహరించుకునేలా.. ప్రభుత్వానికి తమ వినతిని తెలియజేయాలని కోరారు.*
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..
👉 *సూపర్ సిక్స్ అంటూ అబద్ధపు హామీలను గుప్పించి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని అన్నారు.*
👉 *అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు కరెంట్ బిల్లులు అసలు పెంచేది లేదని.. చెప్పి.. ఈరోజు కరెంటు బిల్లులు భారీగా పెంచి ప్రజలపై భారం మోపారని అన్నారు.*
👉 *విద్యుత్ చార్జీల పెంపుతో దాదాపుగా 15 వేల కోట్ల రూపాయలు భారం ప్రజలపై పడనుందని తెలిపారు.*
👉 *చంద్రబాబు నాయుడు అబద్ధాలే చెప్పగలరని.. మరోసారి నిరూపించుకున్నారని అన్నారు.*
👉 *పెరిగిన విద్యుత్ చార్జీలతో ప్రజలు సతమతమవుతున్నారని.. తక్షణమే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.*
👉 *విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే.. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని అన్నారు.*
ఈ కార్యక్రమం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి,వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్, మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుసేని,మాజీ ఏఎంసీ చైర్మన్ పేర్నేటి కోటేశ్వర రెడ్డి,కార్పొరేటర్లు నీలి రాఘవరావు, కరిముల్లా, జయలక్ష్మి, యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున, మైనార్టీ విభాగం అధ్యక్షులు సిద్ధిక్, వాణిజ్య విభాగం అధ్యక్షులు మంచి కంటి శ్రీనివాసులు, విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, వైసిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.