*పుచ్చలపల్లికి ఆదాల ప్రభాకర్ రెడ్డి పరామర్శ*
నెల్లూరు రూరల్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుచ్చలపల్లి రాంప్రసాద్ రెడ్డిగారి తండ్రి పుచ్చలపల్లి ఆదిశేషారెడ్డి గారు ఇటీవల కాలంచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ మండలంలోని పెనుబర్తి గ్రామంలో గురువారం జరిగిన ఆదిశేషారెడ్డిగారి ఉత్తరక్రియలకు *నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారు* హాజరయ్యారు. ఈ సందర్బంగా మాజీ ఎంపీ ఆదాల ఆదిశేషారెడ్డిగారి చిత్రపట్టానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆదిశేషారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో నెల్లూరు విజయ డెయిరి చైర్మన్ కొండ్రెడి రంగారెడ్డి, వైస్సార్సీపీ నాయకులు స్వర్ణ వెంకయ్య, పాశం శ్రీనివాస్, మల్లు సుధాకర్ రెడ్డి, సీహెచ్ హరిబాబు యాదవ్, నాగా శ్రీనివాసులురెడ్డి, కల్లూరు లక్ష్మిరెడ్డి, షేక్ అల్లాబక్షు, బెల్లకొండ వెంకయ్య తదితరులు ఉన్నారు.