*” సందడిగా నెల్లూరు జిల్లా వైకాపా కార్యాలయం”*

*పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల రాకతో కిక్కిరిసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం.*

*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:03-01-2025*

*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, మాజీమంత్రి డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.*

*జనవరి 2వ తేదీ మధ్యాహ్నం నెల్లూరు విచ్చేసిన జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని పలువురు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడంతో, రెండవ రోజు కూడా సందర్శకులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కిటకిటలాడింది.*

*నూతన సంవత్సరం ప్రారంభంలోనే చంద్రబాబు మాట్లాడుతున్న మోసపు మాటలని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని కాకాణి, ఈ సందర్భంగా విచ్చేసిన నాయకులను, కార్యకర్తలను కోరారు.*

*చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 7 నెలల తర్వాత, మరో 7 నెలలకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి విధివిధానాలను పరిశీలిస్తాననడం సిగ్గుచేటన్న కాకాణి.*

*జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవకాశం లభించిన వెంటనే, ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచించి, ఎన్నికలకు ముందు ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలన్ని సంపూర్ణంగా, సమర్థవంతంగా అమలు చేశారు.*

*జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అండగా నిలిచిన విధానాన్ని, చంద్రబాబు ప్రజలను మోసగిస్తున్న పద్ధతిని గమనించి, చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ఎప్పుడు అవకాశం వస్తుందా! అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్న కాకాణి.*

*జమిలి ఎన్నికలు 2027వ సంవత్సరంలోనే రానున్న నేపథ్యంలో, ప్రజలందరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తిరిగి కోరుకుంటున్న పరిస్థితుల్లో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 స్థానాలు, కందుకూరుతో సహా 11 నియోజకవర్గాలతో పాటు, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు స్థానాలలో తిరుగులేని మెజార్టీతో విజయబావుటా ఎగరవేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమయత్తం కావాలని కాకాణి పిలుపునిచ్చారు.*

*తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియజేసిన కాకాణి.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed