పథకాలు అమలు చేయండి అంటే నోటీసులు. ఆర్ పి ఐ
………………..,….
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి పర్యటనలు జరుపుకోవాలని అన్నందుకు పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణంగా ఉందని స్థానిక గాంధీ బొమ్మ ఆర్ పి ఐ పార్టీ జిల్లా కార్యాలయం నందు వాత్రికుల సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా ఆర్ పి ఐ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ కే మాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగినందుకు నోటీసులు ఇవ్వడం అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల గొంతును నొక్కేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాజాధికారాన్ని అనుభవిస్తున్న కూటమి ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు
ఈ కార్యక్రమంలో పట్టపు రంగారావు.నంబూరు గణేష్. దుంపల సుబ్బారావు. బత్తల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు