*నెల్లూరులో పేదల ముంగిటకే వైద్యం.విజయవంతంగా
‘నారాయణ నేత్ర జ్యోతి’*
*మంత్రి నారాయణ సంకల్పం.. నిరుపేదలకు ఉచిత వైద్యం*
15వ డివిజన్లో అట్టహాసంగా ఉచిత వైద్య శిబిరాలు
వేలాది మంది కళ్లల్లో వెలుగులు నింపిన ‘నేత్ర జ్యోతి’
ఇంటి వద్దకే వైద్యం.. పేదలకు అండగా నిలుస్తున్న మంత్రి నారాయణ
నెల్లూరు నగరంలోని 15వ డివిజన్లో నారాయణ నేత్ర జ్యోతి మరియు నారాయణ దంత సురక్ష కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయి . రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ ఆదేశాల మేరకు, ప్రతి డివిజన్లోని నిరుపేదలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ మహోద్యమం కొనసాగుతోంది.
ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన ఈ శిబిరాల్లో ఇప్పటివరకు 1600 మందికి పైగా ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకోగా, వారిలో 890 మందికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. అంతేకాకుండా, దృష్టి లోపంతో బాధపడుతున్న 25 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించి వారికి కంటిచూపు ను ప్రసాదించారు. పేద ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, వారి ఇంటి వద్దకే వైద్య సేవలు తీసుకురావాలన్న మంత్రి సంకల్పం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ సుధా,ప్రశాంత్..15వ డివిజన్ కార్పొరేటర్ గణేష్ సుజాత వెంకటేశ్వర రెడ్డి,డివిజన్ అధ్యక్షుడు కేపీ చౌదరి, క్లస్టర్ ఇంచార్జి అంచురి శ్రీనివాసులు నాయుడు.. యూనిట్ ఇన్ఛార్జ్ లు ప్రసాద్ రావు, పరశురాం, వెంకటరమణ..బూత్ కన్వీనర్లు.. స్థానిక టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
Post navigation
*”స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన” తో ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇక వేగం పుంజుకోనుంది, పరిశ్రమ రాకతో లక్షకు పైగా ఉద్యోగాలు యువతకు లభించనున్నాయి.* *కేంద్ర మంత్రి కుమారస్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేసిన “ప్రపంచ స్థాయి సమీకృత ఉక్కు కర్మాగారం” రాష్ట్రానికి గర్వకారణం.* *రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు నారా లోకేష్ శక్తికి మించి పనిచేస్తున్నారు. అనకాపల్లి లో “స్టీల్ ప్లాంట్” ఏర్పాటు ఘనత నారా లోకేష్ దే.* *”Job first “విజన్ తో యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా మంత్రి లోకేష్ గారు సాధించిన ఈ ప్రాజెక్ట్ ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు పారిశ్రామిక ఆవిష్కరణల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడుతుంది.* *ప్రపంచ స్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఒక జూమ్ కాల్ సమావేశంతో దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం రాష్ట్రానికి వచ్చింది* *పెట్టుబడిదారులతో నిరంతర చర్చలు, ప్రత్యక్ష సమన్వయం, తక్కువ సమయంలో క్లియరెన్స్ లతో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ను స్వర్గధామిగా మార్చింది కూటమి ప్రభుత్వం.* *- బీద రవిచంద్ర, శాసనమండలి సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు.* ▪️అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ అండ్ నిస్సాన్ స్టీల్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న భారీ స్టీల్ ప్లాంట్ కు నిన్నటి రోజున శంకుస్థాపన జరగడం రాష్ట్రానికి గర్వకారణం నిలిచింది. ▪️దేశ ఉక్కు తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే ఒక ప్రపంచ స్థాయి సమీకృత ఉక్కు కర్మాగారానికి కేంద్ర మంత్రి కుమారస్వామి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ శంఖుస్థాపన చేశారు. ▪️దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టులలో ఒకటైన ఈ ప్రాజెక్టు సుమారు రూ.1,35,964 కోట్లకు పైగా పెట్టుబడితో అతిపెద్ద ఉక్కు కర్మాగారాన్ని నిర్మించబోతోంది. ▪️లక్షకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు ఈ కర్మాగారం ద్వారా సృష్టించబడతాయి. స్థానిక యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ▪️స్కిల్ డెవలప్మెంట్, టెక్నికల్ ట్రైనింగ్, అనుబంధ పరిశ్రమల ద్వారా యువతకు పెద్ద ఎత్తున దీర్ఘకాలిక అవకాశాలు ఏర్పడతాయి. ▪️కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారదర్శక పాలసీలు, వేగవంతమైన అనుమతులు పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ▪️ప్రపంచ స్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే అది కూటమి ప్రభుత్వం పై, ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ▪️ స్టీల్ ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ కు రప్పించేందుకు మంత్రి నారా లోకేష్ గారు ఎంతో కృషి చేశారు. పెట్టుబడిదారులతో నిరంతర చర్చలు, ప్రత్యక్ష సమన్వయం, తక్కువ సమయంలో అనుమతులు మంజూరు చేయించడం ద్వారా ఈ ప్రాజెక్టును సాధించారు. ▪️కేవలం ఒక జూమ్ కాల్ మీట్ తోనే దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారాన్ని ఉత్తరాంధ్రకు తీసుకువచ్చి పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ను స్వర్గధామిగా నిలిపింది కూటమి ప్రభుత్వం. ▪️”Job first “విజన్ తో యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా మంత్రి లోకేష్ గారు ముందుకు తీసుకెళ్లిన ప్రాజెక్ట్ ఇది. యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా పారిశ్రామిక ఆవిష్కరణల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడుతుంది. ▪️ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు రాకతో ఉత్తరాంధ్ర ఇండస్ట్రియల్ హబ్ గా అభివృద్ధి చెందుతోంది. పోర్ట్ కనెక్టివిటీ, రహదారి, రైల్వే సదుపాయాలు మెరుగుపడి లాజిస్టిక్స్ రంగం బలోపేతం అవుతుంది. ▪️ ఎమ్.ఎస్.ఎమ్ ఈ., చిన్న పరిశ్రమలు స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు వల్ల అభివృద్ధి చెందుతాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. ▪️ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దేందుకు, రాష్ట్ర GDP వృద్ధి, పారిశ్రామిక విస్తరణ, పెట్టుబడుల ప్రవాహం వేగం పుంజుకోవడంలో స్టీల్ ప్రాజెక్ట్ కీలకం గా మారనుంది. ▪️ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తును మార్చే ఉపాధి యంత్రం. ఈ పరిశ్రమ రాకపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ▪️5,465 ఎకరాల్లో నిర్మించనున్న ఈ పరిశ్రమ రెండు దశల్లో పూర్తి కానుంది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ▪️మొదటి దశలో ఏడాదికి 7.3 మిలియన్ టన్నులు (ఎంటీపీఏ) రెండో దశలో 10.5 టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. 2030 జూన్ నాటికి మొదటి, డిసెంబర్ నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నేస్ అందుబాటులోకి రానున్నాయి. ▪️స్టీల్ ప్లాంట్ తో పాటు 50 ఎంటీపీఏ సామర్థ్యంతో, రూ. 11,192 కోట్లతో 316 ఎకరాల్లో క్యాప్టివ్ పోర్టును నిర్మించనున్నారు. దీని ద్వారా 6వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ▪️స్టీల్ ప్లాంట్ పరిశ్రమను జాతీయ రహదారికి అనుసంధానిస్తూ నాలుగు వరసల రహదారి నిర్మాణం కూడా కూటమి ప్రభుత్వం చేపట్టనుంది.