- *నెల్లూరులో జరుగు సిపిఎం పార్టీ 27వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఇంటింటి ప్రచారం : సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు*
సిపిఎం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ 27వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ నెల్లూరు నగరం 54వ డివిజన్ పరిధిలోని జనార్దన్ రెడ్డి కాలనీ నందు సిపిఎం పార్టీ కార్యకర్తలు 5 దళాలుగా ఏర్పడి కరపత్రాలు ఇస్తూ ప్రచారం నిర్వహించడం జరిగినది
ముందుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ జనార్దన్ రెడ్డి కాలనీ మసీదు సెంటర్ వద్ద అన్ని దళ సభ్యులకు రెడ్ టవలు మెడలో వేసి ప్రతి కార్యకర్తకు ఎర్రజెండా చేతికిచ్చి ఈ దళాలను జండా ఊపి ప్రారంభించడం జరిగినది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఆంధ్ర ప్రదేశ్ 27వ రాష్ట్ర మహాసభలో దాదాపు 46 సంవత్సరాలు తర్వాత మన నెల్లూరు నగరంలో జరుగుతున్నాయని కార్మిక కర్షక ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద ఈ మహాసభలలో చర్చించి భవిష్యత్తు పోరాటాలను నిర్వహించేందుకు ఈ మహాసభలు ఉపయోగపడతాయని, ఈ మహాసభలకు ప్రజల నుండి అనూహమైన స్పందన వస్తుందని ప్రజలు మా భుజం తట్టి మాకు సహకరిస్తున్నారని ప్రజల సహకారం మాకు ఎల్లవేళలా ఉంటుందని వారు అన్నారు
ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3-00 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ వద్ద నుండి భారీ ర్యాలీ అనంతరం వి ఆర్ సి గ్రౌండ్ లో జరుగు బహిరంగ సభను కార్మికులు కర్షకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వర రావు, షేక్ మస్తాన్ బి, నగర కమిటీ సభ్యులు మూలం. ప్రసాద్, షేక్ జాఫర్ నాయకులు కరీముల్లా, ఆర్టీసీ బాబు, సురేష్, షేక్ షాహిన్, రసూల్,సమీవుల్లా,ఖాదర్ ఖాన్, పి కృష్ణ,మూలే.సీనయ్య, ఖాజావలి భాగ్యమ్మ కామెల సల్మా తదితరులు పాల్గొన్నారు