
SPS నెల్లూరు జిల్లా
*నెల్లూరు సౌత్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.,*
*నెల్లూరు సౌత్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మ్యాప్, ఆయా పరిసరాలను, రికార్డులను పరిశీలించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచన.*
సౌత్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని ట్రాఫిక్ పాయింట్స్ ఉన్నాయి? హిట్ & రన్ కేసులు, ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలు, నివారణ చర్యలు, U-టర్న్ పాయింట్స్, పార్కింగ్ ప్రాంతాలు, వ్రాంగ్ పార్కింగ్, బారికేడింగ్, వన్ వే, ఆటోల కదలికలు, ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాట్లు తదితర అంశాలపై ఆరా.
స్థానిక పోలీసులు మరియు ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతోనే నేర నియంత్రణ.
అత్యవసర కార్యకలాపాలు సాఫీగా సాగుటకు ట్రాఫిక్ పోలీసుల పాత్ర అత్యంత కీలకమైనది.
ట్రాఫిక్ సిబ్బందిని నియమించిన ప్రదేశంలోనే ఉండి ప్రజలకు అసౌకర్యం లేకుండా ట్రాఫిక్ నియంత్రించాలి.
డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ పై స్పెషల్ డ్రైవ్ ల నిర్వహణతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలి.
ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. నీరు బాగా తాగాలి. డీహైడ్రేషన్ కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సిబ్బంది సంక్షేమంపై ఆరా తీసిన యస్.పి. గారు
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.17.12.2025.