*నెల్లూరు రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి*

నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ వద్ద రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు దేవుడు మనోధైర్యం అందించాలన్నారు.

క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె భగవంతుని ప్రార్థించారు. నిరు పేదలైన మొక్కజొన్న కంకులు అమ్ముకునే వారితో పాటు వాటిని కొనుగోలు చేసేందుకు వచ్చిన వారిపై లారీ దూసుకెళ్లడం విషాదకరమని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed