*నెల్లూరు రూరల్ లో రౌడీయిజాన్ని ఉపేక్షించేది లేదు సామాన్యుడి పై దాడి చేసిన వారు ఎవరైనా బేషరతుగా అరెస్టు చేయిస్తాం*….
*ఇందిరమ్మ కాలనీ అసాంఘిక కార్యక్రమాలకు నెలువుగా మారింది*…
*సామాన్యుడు శాంతి భద్రతల పరిరక్షణ జనసేన పార్టీ కర్తవ్యం,ఆర్తులకు అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిపారు*…
*ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి,పోలీసులు దృష్టికి తీసుకువచ్చి ఆకతాయిలా ఆగడాలకు కళ్ళెం వేస్తాం*….
*గునుకుల కిషోర్* జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి.
నెల్లూరు రూరల్ 24 డివిజన్ ఇందరమ్మ కాలనీ వద్ద నివాసముంటున్న తాపీ మేస్త్రి శీను ను గత గురువారం కనుపర్తికి పాడుకు చెందిన ఒక నలుగురు అకారణంగా విచక్షణా రహితంగా కొట్టి ఇంటి వద్దకు తీసుకువచ్చి పడేశారు…
నిన్ను బతకనివ్వము మీ అందరికీ ఇళ్ల పట్టాలు లేవు,మీ అందరి ఇల్లు కూలదోస్తామని కొంతమంది ఆకతాయిలు బెదిరించారు.
అనుకోని సంఘటనతో బెంబేలెత్తిన వారి కుటుంబ సభ్యులు వారి బంధువులు ఇంటికి వెళ్లి తలదాచుకున్నారు. జనసేన క్రియాశీలక సభ్యుడైన శీను భార్య ఈ విషయాన్ని జనసేన జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కి తెలియజేయగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి తెలియపరచి బాధితులకు అండగా నిలబడి వారికి న్యాయం చేయాలని కోరిన తక్షణమే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు దాడి చేసిన వారు ఎవరైనా అరెస్టు చేయిస్తామని నెల్లూరు రూరల్ లో రౌడీయిజాన్ని సహించబోమని చెప్పారు.
ఈ రోజు సాయంత్రం బాధితులని పరామర్శించటానికి వెళ్ళిన గునుకుల కిషోర్ కి చుట్టూ ఉన్న స్థానికులు ఇక్కడ ఇందిరమ్మ కాలనీలో అసాంఘిక కార్యక్రమాలకు అదుపులేకుండా జరుగుతున్నాయి, దొంగతనం దాడులు విపరీతంగా జరుగుతున్నాయి ఈ విషయమై పోలీసులకు ఎన్ని సార్లు చెప్పినా కూడా సరిగా ఇక్కడ గస్తీ పెట్టడం లేదు. ఈ ప్రాంతంలో ఎందుకు నివసిస్తున్నామా అన్న బాధ తో ఇక్కడ ఉంటున్నామని తెలిపారు.
ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని తోడుగా జనసేన పార్టీ ఉంటుంది.
ధైర్యంగా ఉండాలని భరోసాగా ఎమ్మెల్యే సైతం తమకు తోడున్నారని శీను మరియు వారి కుటుంబ సభ్యులకు తెలిపారు.
స్థానికుల సమస్యలను రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చి ఆకతాయిల ఆగడాలకు కళ్లెం వేస్తామని జనసేన పార్టీ నాయకులు గునుకుల కిషోర్ తెలిపారు.ఈ రోజున సీఎం గారి ప్రోగ్రాం కందుకూరులో ఉండడంవల్ల నెల్లూరు రూరల్ సిఐ గారు అందుబాటులో లేరని రేపు ఉదయం కేసు కట్టించి దాడి చేసిన వారు ఎవరైనా వారిపై చట్టరీత్యా కఠినంగా శిక్షలు అమలుపడేటట్టు చూస్తాం….అని తెలపారు.