
*నెల్లూరు నగర్ లోని పలు ప్రాంతాలలో డ్రైన్లు ,కాలువలు, పలుచోట్ల ఉన్న వర్షo నీటి పారుదలని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన కమిషనర్ వై ఓ నందన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ నగరవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వరదనీటి ప్రవాహాన్ని పర్యవేక్షించేందుకు మంగళవారం ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి వివిధ ప్రాంతాలలో పర్యటించారు.
ముందుగా మాగుంట లేఔట్ కే.కే.ఆర్ గౌతం పాఠశాల సమీపం ఐదో వీధిలో రోడ్లపై నిలిచిన వరద నీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించేందుకు కచ్చ డ్రైన్ ఏర్పాటు చేయమని ఆదేశించి పనులను పర్యవేక్షించారు.
స్థానికంగా ఉన్న ఎం.ఎస్.ఆర్ పార్కు సమీపంలో రోడ్లపై నిలిచిన వరద నీటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
విజయ మహల్ గేటు ప్రాంతం నేతాజీ పైలెట్ స్కూల్ పరిసర ప్రాంతాలలో మెగా డ్రైన్ కాలువలో వరదనీటి ప్రవాహాన్ని పరిశీలించి అధికారులకు వివిధ సూచనలు జారీ చేశారు.
కొత్త హాల్ సమీపంలోని జయ దర్శన్ అపార్ట్మెంట్ సమీపంలో మెగా డ్రైను కాలువలో వరద నీటి ప్రవాహానికి ఇటీవల చేపట్టిన పూడికతీత పనులను కమిషనర్ పరిశీలించారు.
స్థానిక వెంకటరమణ హోటల్ సమీపంలోని మెగా డ్రైన్ కాలువపై చేపట్టిన అక్రమ నిర్మాణాలను యుద్ధ ప్రతిపాదికన తొలగించి, డ్రైను కాలువలలో వరదనీటి ప్రవాహం సాఫీగా జరిగాలా చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం, శానిటేషన్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.b