*నెల్లూరు నగరపాలక సంస్థకు ఒక కోటి 20 లక్షల విలువైన నాలుగు బస్సులను బహూకరించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమిషనర్ వై.ఓ నందన్ హాజరై జెండా ఊపి బస్సులను ప్రారంభించారు.*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు పి. నారాయణ సూచనల మేరకు యూనియన్ బ్యాంక్ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల వినియోగంలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థకు ఒక కోటి 20 లక్షల విలువైన నాలుగు బస్సులను బహూకరించారు.

స్థానిక వి.ఆర్ మున్సిపల్ పాఠశాల మైదానంలో మంగళవారం జరిగిన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమిషనర్ వై.ఓ నందన్ హాజరై జెండా ఊపి బస్సులను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నెల్లూరు నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed