నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆప్కాస్ విధానంలో డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్న వారు అత్యంత క్రమశిక్షణను పాటించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కనబరిస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కమిషనర్ వై.ఓ నందన్ హెచ్చరించారు.

కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో డ్రైవర్లతో సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ లో చెత్త సేకరణ వాహనాలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల డ్రైవర్లతో పాటు కార్యాలయ వివిధ విభాగాల అధికారులకు డ్రైవర్లుగా వ్యవహరిస్తున్న సిబ్బంది హాజరును క్రమం తప్పకుండా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.

నిర్దేశించిన సమయానికి విధులలో చురుకుగా పాల్గొని కేటాయించిన విధులలో నిబద్ధత పాటించాలని సూచించారు.

దీర్ఘకాలిక గైర్హాజరు ఉన్నవారు, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వారిని గుర్తించి తప్పనిసరిగా ఉద్యోగాల నుంచి తొలగించి వేస్తామని కమిషనర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్ మోహన్ రావు, ఈ.ఈ రహంతు జానీ, డి.ఈ రఘురామ్, సిబ్బంది పాల్గొన్నారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *