నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ మంగళవారం నిరంతరం పర్యటిస్తూ వరద ముంపు ప్రాంతాలలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా వరదనీటి ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు

 

మొంథా తుఫాను నేపథ్యంలో నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజా జీవనానికి ఎలాంటి అడ్డంకులు కలగకుండా నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ మంగళవారం నిరంతరం పర్యటిస్తూ వరద ముంపు ప్రాంతాలలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా వరదనీటి ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు.

వరద ముంపు ప్రాంతాల నుంచి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 14 ప్రాంతాలలో ఏర్పాటుచేసిన తుఫాను పునరావాస కేంద్రాలలో ప్రజలకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించి అధికారులకు ఎప్పటికప్పుడు వివిధ సూచనలు జారీ చేస్తున్నారు.

అన్ని ప్రధాన డ్రైను కాలువలలో పూడికతీత పనులు నిరంతరం జరిగేలా పర్యవేక్షిస్తూ వరద నీరు రోడ్లపై నిలిచిపోకుండా సిబ్బందికి వివిధ సూచనలను జారీ చేస్తున్నారు.

నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో తుఫాను సహాయక హెల్ప్ లైన్ కేంద్రాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక కార్యక్రమాలను వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలు ద్వారా అవసరమైన వారికి ఉచిత వైద్య సేవలు మందులు అందజేసేందుకు అప్రమత్తంగా ఉండేలా కమిషనర్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధికారులు, ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తున్నారు.

డివిజన్ల వారీగా సచివాలయాల అడ్మిన్ కార్యదర్శుల నేతృత్వంలో స్థానికంగా భారీ వర్షాలకు కూలిపోయిన చెట్లను రోడ్లపై నుంచి తొలగించి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా నిరంతరం కమిషనర్ పర్యవేక్షిస్తున్నారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed