
నెల్లూరు నగర రూపురేఖలు మారుస్తాం: మంత్రి నారాయణ
13వ డివిజన్లో అత్యాధునిక పార్క్ ప్రారంభం.
సింగపూర్ తరహాలో గ్రీన్ నెల్లూరు.
పేదల కోసమే పార్కుల్లో ఏసీ ఫంక్షన్ హాళ్లు: మంత్రి నారాయణ.
నెల్లూరులో అడ్వెంచర్ & వాటర్ స్పోర్ట్స్ పార్కులు
దోమలు లేని నగరమే లక్ష్యం..
850 కోట్లతో నెల్లూరు అభివృద్ధికి శ్రీకారం
నెల్లూరు సిటీలో ‘పార్కుల పండగ’ కొనసాగుతోంది.బలిజపాలెంలో 40 లక్షల రూపాయల వ్యయంతో అన్ని ఆధునిక హంగులతో సిద్ధమైన పార్కును మంత్రి నారాయణ జాతర వాతావరణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కులో ఏర్పాటు చేసిన ఏసీ మినీ ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించిన మంత్రి, ఒక చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్కులో జిమ్ చేసి అందరినీ ఉల్లాసపరచడమే కాకుండా, చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేస్తూ వారితో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా *మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం బలిజపాలెం పార్కును అభివృద్ధి చేశామని, సిటీలో లక్ష్యంగా పెట్టుకున్న 47 పార్కుల్లో ఇప్పటికే 44 పూర్తి చేశామని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలు రూపాయి ఖర్చు లేకుండా పార్కుల్లోనే శుభకార్యాలు జరుపుకోవచ్చని, త్వరలోనే భారీ అడ్వెంచర్ మరియు వాటర్ స్పోర్ట్స్ పార్కులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నెల్లూరును చండీగఢ్, సింగపూర్ తరహాలో గ్రీన్ సిటీగా మార్చడమే తన లక్ష్యమని, ఇందుకోసం 850 కోట్ల నిధులు కేటాయించామన్నారు.యూజీడీ పనులు పూర్తి చేసి నగరాన్ని దోమల రహితంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. బలిజపాలెంలో 50 లక్షలతో కమ్యూనిటీ హల్ నిర్మాణానికి మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .
ఈ కార్యక్రమంలో కమీషనర్ నందన్ ,మేయర్ సుజాత అశోక్ ,మాజీ మున్సిపల్ చైర్పెర్సన్ తాళ్ళపాక అనురాధ,కార్పొరేటర్ కర్తం ప్రతాప రెడ్డి ,డివిజన్ క్లస్టర్ ఊటుకూరు చంద్ర ,ప్రెసిడెంట్ కాయల తిరుపతి ,అశ్విన్ ,టీడీపీ మహిళా నాయకురాళ్లు కపిర రేవతి ,రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు .