*నెల్లూరు టౌన్‌లో 30 పోలీస్ యాక్ట్ అమలు – ASP దీక్ష,*

 శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నెల్లూరు టౌన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ (Indian Police Act – Section 30) అమల్లో ఉందని టౌన్ ASP శ్రీమతి దీక్ష, IPS., గారు తెలిపారు.
 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న సమయంలో ప్రజా సంఘాలు, యూనియన్లు, రాజకీయ పార్టీలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలంటే సబ్ డివిజన్ పోలీస్ అధికారి నుంచి ముందుగా తప్పనిసరిగా అనుమతి పొందాలని సూచించారు.
 ఏ ప్రాంతంలోనైనా శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉన్నట్లయితే, సంబంధిత సమావేశాలు లేదా కార్యక్రమాలను నిషేధించే అధికారం పోలీస్ అధికారులకు ఉంటుందని తెలిపారు.
 అనుమతి లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించినట్లయితే, బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించి, చట్టాన్ని గౌరవిస్తూ శాంతియుత వాతావరణం కొనసాగేందుకు సహకరించాలని కోరారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *