SPS నెల్లూరు జిల్లా,

*నెల్లూరు టౌన్ లోని ట్రాన్స్‌జెండర్స్‌తో సమావేశం నిర్వహించిన నెల్లూరు టౌన్ ASP శ్రీమతి దీక్ష, IPS.,*

 గుంటూరు రేంజ్ IG గారు మరియు జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు, నెల్లూరు టౌన్ ASP శ్రీమతి దీక్ష, IPS., గారు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌ నందు ట్రాన్స్‌జెండర్స్‌తో సమావేశం నిర్వహించారు.
 నెల్లూరు టౌన్‌లో నేరాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు.
 ప్రజలతో మమేకమై శాంతియుతంగా జీవించాలని, ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రవర్తనకు దూరంగా ఉండాలి.
 ఎవరితోనూ దౌర్జన్యంగా లేదా దురుసుగా ప్రవర్తించరాదు.
 బెగ్గింగ్, ఎక్స్టార్షన్, దొంగతనాలకు పూర్తిగా దూరంగా ఉండండి. వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాము.
 నెల్లూరు టౌన్‌లో డ్రోన్‌లు మరియు CC కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. ఓపెన్ డ్రింకింగ్ చేయరాదని, గాంజా వంటి మాదక ద్రవ్యాల సేవనము లేదా అమ్మకం సహించేది లేదు.
 పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని, చట్ట పరిరక్షణలో భాగస్వాములుగా ఉండాలని కోరారు.
 ట్రాన్స్‌జెండర్స్ వారి వివరాలు, నైపుణ్యాల ఆధారంగా సాధ్యమైనంత వరకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 సమావేశం నిర్వహించి మంచి మాటలు చెప్పిన ASP గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ట్రాన్స్‌జెండర్స్‌.
 ఈ కార్యక్రమంలో నెల్లూరు టౌన్ ASP శ్రీమతి దీక్ష, IPS., గారితో పాటు నెల్లూరు టౌన్ CI గార్లు పాల్గొన్నారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *