*నెల్లూరు జిల్లాలో *పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి*
*తగిన విధంగా *ఈ బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించాలి : బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్*
కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల వేదికలో జాయింట్ కలెక్టర్ కార్తీకు విజ్ఞప్తి చేశారు
1. సోమశిల డ్యామ్ పనులు నిధులు లేక ఆగిపోయి ఉన్నాయి. జలాశయం గేట్లు రోప్‌లు మార్పులు మరమ్మతులు చేయవలసి ఉంది
2. సర్వేపల్లి కనిగిరి రిజర్వాయర్లు ఆధునీకరణ పనులకు అనుమతులు లభించి ఉన్నాయి నిధులు లేక ఆ పనులు ప్రారంభించలేదు
3. సర్వేపల్లి కాలువ లైనింగ్ పరువులను నిధులు లేక అర్ధాంతరంగా నిలిపివేసి ఉన్నారు . సుప్రీం కోర్ట్ మార్గదర్శకాలు ప్రకారం సర్వేపల్లి కాలవను వైడనింగ్ చేయాల్సి ఉంటే కాలమును సగనికి కుదించి 90 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. సర్వేపల్లి కాలువ ఆధునీకరణలో భాగంగా పర్యాటక శాఖ బోటు విహారం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం డిపిఆర్‌లను కోరి ఉంది.
4. ముదివర్తి బ్యారేజీ నిధులు లేక ఆగిపోయి ఉంది
5. నెల్లూరు బ్యారేజ్. సంఘం బ్యారేజ్. సోమశిల జలాశయం లను పర్యాటక కేంద్రాలుగా మార్చవలసి ఉంది.
6. సోమశిల కండలేరు వరద కాలువ వైడినింగ్ నిధులు కొరతతో ఆగిపోయింది
ప్రస్తుత బడ్జెట్ సమావేశాలలో నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని రమేష్ ప్రభుత్వానికి కోరారు
ఈ కార్యక్రమంలో రఘురామయ్య .అల్లూరు నాగేంద్ర సింగ్. రత్నం నాయుడు .మారం కృష్ణ .కళ్ళు భాస్కర్. లక్ష్మణరావు నారాయణరావు . పి పి ఎన్. ప్రసాద్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు