*SPS నెల్లూరు జిల్లా*

*నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతున్న డ్రోన్ నిఘా – *నెల్లూరు జిల్లాలోని శివారు ప్రాంతాలలో నేరాలకు చెక్ పెడుతూ, జల్లెడ పడుతున్న నెల్లూరు పోలీసులు.* : జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.,*

 *జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గారి సూచనల మేరకు, సంబంధిత DSP గార్ల ఆధ్వర్యంలో ఆయా CI/SI ల సమక్షంలో డ్రోన్ తో, నెల్లూరు పట్టణ, శివారు, నిర్మానుష్యమైన ప్రదేశాల్లో క్షుణ్ణంగా పరిశీలించి, పట్టణ సమీప ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డు కట్టు వేస్తున్న నెల్లూరు పోలీసులు.*
 *జిల్లావ్యాప్తంగా ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు మరియు ప్రత్యేకంగా టౌన్ పరిసర ప్రాంతాల్లో రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు విస్తృతంగా డ్రోన్ నిఘా ఏర్పాటు చేసిన నెల్లూరు పోలీసులు*
 *నెల్లూరు జిల్లాలోని శివారు ప్రాంతాలలో నేరాలకు చెక్ పెడుతూ, జల్లెడ పడుతున్న నెల్లూరు పోలీసులు.*
 _*అందులో భాగంగా ఓపెన్ డ్రింకింగ్ పై ఉక్కుపాదం మోపుతూ కేసులు నమోదు చేయడం జరిగింది.*_
 *గ్యాంబ్లింగ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్ నిఘా… బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..*
 *ఓవర్‌ స్పీడ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, త్రిబుల్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌లను గుర్తిస్తాం..*
 *నేర నియంత్రణే లక్ష్యంగా క్రైమ్ ప్రోన్ ఏరియాల పై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా….*
 *క్రైమ్ ప్రోన్ ఏరియాలపై డ్రోన్ కెమెరాలను ఉపయోగించి నిరంతరం పర్యవేక్షిస్తున్న నెల్లూరు పోలీసులు.*
 *బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట నిర్వహణ, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ప్రాంతాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరిగింది.*
 *నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న నిశితమైన ప్రదేశాలను ముందుగా గుర్తించి, పాడుపడిపోయిన బంగ్లాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలను, పార్కులు, నదీ తీరాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి, నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.*
 *కావున ఎవరైన చట్ట వ్యతిరేక మరియు క్రిమినల్ చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు.*
 *గంజాయి సేవించడం, అమ్మడం, రవాణా చేసే వారు పట్టుబడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.*
 *జిల్లాలో ఇకపై సాంకేతికతతో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాల నియంత్రించుటకు వినూత్న చర్యలు తీసుకుంటున్న నెల్లూరు పోలీసులు. ఎవరికైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కి తెలపగలరు.*

జిల్లా పోలీసు కార్యాలయం, తేది.13.12.2025.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed