*నూతనంగా శాసన మండలి సభ్యులు గా ఎన్నికైన అనంతరం తొలిసారి గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం కు విచ్చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర ని శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారి నేతృత్వంలో గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ గజమాల తో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు.*
*గూడూరు నియోజకవర్గం పరిధిలోని పలు శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారితో కలిసి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర యాదవ్ గారు పాల్గొన్నారు.*
*గూడూరు సమగ్ర అభివృద్దే లక్ష్యంగా అధికారులకు పలు సూచనలు చేశారు.*
*కొన్ని గ్రామాలను గూడూరు మున్సిపాలిటీ లో విలీనం చేయాలని గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదన తో గూడూరు అభివృద్ధి కుంటుపడటంతో పాటు ఎప్పుడో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.*
*మున్సిపాలిటీలో పలు గ్రామాల విలీన ప్రతిపాదనను ప్రభుత్వం రద్దు చేయనున్న తరుణంలో రానున్న 3, 4 నెలల కాలంలో ఎన్నికలు రానున్నాయి.*
*గూడూరు మున్సిపల్ ఎన్నికలకు కూటమి శ్రేణులు సన్నద్ధం కావాలని , పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులతో పాటు భవిష్యత్తు లో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.*