
*నూతనంగా నిర్మించిన డ్రైను కాలువల నిర్వహణ తీరును పరిశీలించిన కమిషనర్ వై ఓ నందన్*
నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ స్థానిక 16వ డివిజన్ మిలీనియం సబ్ స్టేషన్ సమీపంలోని గుర్రాల మడుగు సంఘం ప్రాంతంలో సోమవారం ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పర్యటించారు.
నూతనంగా నిర్మించిన డ్రైను కాలువల నిర్వహణ తీరును పరిశీలించారు. సర్వేపల్లి కాలవకు అనుసంధానంగా ఉన్న డ్రైను కాలువలలో మురుగునీటి ప్రవాహం తీరును పరిశీలించి అధికారులకు వివిధ సూచనలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం, శానిటేషన్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.