*నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక 19, 20 డివిజన్లు గోమతి నగర్, ఇస్కాన్ సిటీ పరిసర ప్రాంతాల్లో సోమవారం పర్యటించిన నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్*

డివిజన్ పరిధిలోని అన్ని డ్రైను కాలువలలో మురుగు నీటి ప్రవాహాన్ని కమిషనర్ పర్యవేక్షించి ఓవెల్ స్కూల్ సమీపంలోని ప్రధాన డ్రైను కాలువలో మురుగునీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

డ్రైను కాలువల ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న మెట్లు, ర్యాంపులు తదితర నిర్మాణాలను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు, సర్వేయర్, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

పి.ఆర్.ఓ.
నెల్లూరు నగరపాలక సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *