*నిర్దేశించిన గడువులోపు అత్యంత నాణ్యతతో రోడ్డు నిర్మాణం పనులు, డ్రైను నిర్మాణం పనులను పూర్తి చేయాలని ఆదేశించిన కమిషనర్ వై ఓ నందన్*

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్  స్థానిక ఆత్మకూరు బస్టాండు అండర్ బ్రిడ్జి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం పర్యవేక్షించారు.

నిర్దేశించిన గడువులోపు అత్యంత నాణ్యతతో రోడ్డు నిర్మాణం పనులు, డ్రైను నిర్మాణం పనులను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను కమిషనర్ ఆదేశించారు.

ఆత్మకూరు బస్టాండు అండర్ బ్రిడ్జి అభివృద్ధి పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, నగర సుందరీకరణలో భాగంగా అండర్ బ్రిడ్జి ప్రాంతాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దనున్నామని కమిషనర్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ. రామ్ మోహన్ రావు, ఈ.ఈ రహంతు జానీ, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *