*నిర్దేశించిన అనుమతుల మేరకే నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలి ; నగర కమిషనర్ వై ఓ నందన్*

 

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ స్థానిక 14వ డివిజన్ ఏసీ నగర్ ప్రాంతంలోని ఎమ్.ఎస్.ఎమ్ పార్కు పరిసర ప్రాంతాలలో సోమవారం పర్యటించారు.

స్థానికంగా జరుగుతున్న అపార్ట్మెంట్ నిర్మాణాన్ని కమిషనర్ పరిశీలించి నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం మంజూరు చేసిన అనుమతులను పరిశీలించారు. అపార్ట్మెంట్ కు సంబంధించి వేకంట్ ల్యాండ్ టాక్స్ చెల్లింపులను తనిఖీ చేశారు.

నిర్దేశించిన అనుమతుల మేరకే నిర్మాణం చేపట్టేలా సంబంధిత సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పర్యవేక్షించాలని, నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ విభాగాల అధికారులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *