నిరాశ్రయులకు అన్న క్యాంటీన్ల ఆహారం అందించండి
– కమిషనర్ సూర్య తేజ ఐ.ఏ.ఎస్.,
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసి ఉన్న శరణార్థుల శిబిరంలో ఉన్న నిరాశ్రయులకు అన్న క్యాంటీన్ల నుంచి ఆహారాన్ని, అందించాలని అలాగే భవనము యొక్క మరమ్మత్తు లను వెంటనే చెల్లించాలని కమిషనర్ సూర్య తేజ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ బుధవారం స్థానిక పాత మున్సిపల్ ఆఫీస్ కార్యాలయంలోని శరణార్థుల శిబిరాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శిబిరంలో ఉన్న వారందరికీ సబ్బు, నూనె, ఇతర క్రాస్మోటిక్స్, దుప్పట్లు, నూతన వస్త్రాలు అందించాలని సూచించారు. జాతీయ పట్టణ జీవనోపాధుల పథకం ఏ.ఆర్.డి.పి.డి. నిర్వహణలోని నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రము, నెల్లూరు నగరపాలక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిరోజు 50 మంది నిరాశ్రయులకు అన్న క్యాంటీన్ల ద్వారా ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక అన్న క్యాంటీన్ కమిషనర్ సందర్శించి ప్రజలకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించి నిర్వాహకులకు వివిధ సూచనలు జారీ చేశారు.
అనంతరం సమీపంలోని వీధి శునకాల జనన నియంత్రణ కేంద్రాన్ని కమిషనర్ సందర్శించి వెటర్నరీ వైద్యునితో మాట్లాడారు. శస్త్ర చికిత్సలకు సంబంధించిన వివరాల నమోదు రిజిస్టర్ లను కమిషనర్ పరిశీలించి తగిన సూచనలు జారీ చేశారు.
స్థానిక బాలాజీ నగర్ బాజీ తోట ప్రాంతంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు నేర్చుకుంటున్న కర్రసాము ప్రదర్శనను కమిషనర్ వీక్షించి విద్యార్థులను అభినందించారు. 15వ డివిజన్లోని 1,2,3 సచివాలయాలను కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయాలలోని వివిధ రికార్డులను తనిఖీ చేసి కార్యదర్శులకు వివిధ సూచనలు జారీ చేశారు. సచివాలయ పరిధిలో ఆస్తి పన్ను, తాగునీటి కుళాయి పన్ను, ఖాళీ స్థలాల పన్నుల వసూళ్లను వేగవంతం చేసి 100% లక్ష్యాలను పూర్తి చేయాలని కమిషనర్ వార్డు కార్యదర్శులను ఆదేశించారు. డ్రైను కాలువల పూడికతీత, సిల్ట్ ఎత్తివేత, పారిశుద్ధ పనుల పర్యవేక్షణను క్రమం తప్పకుండా ప్రతిరోజు పర్యవేక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమాల్లో నగరపాలక సంస్థ డిప్యూటీ కమీషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ. రామ్ మోహన్ రావు, ఈ.ఈ. రహంతు జాని, వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్మోహన్, రెవిన్యూ ఆఫీసర్ ఇనాయతుల్లా,ఇంజనీరింగ్,పబ్లిక్ హెల్త్,ప్లానింగ్, అ ధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు,వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.