నార్త్ రాజుపాలెం పునరావాస కేంద్రంలో భోజనం, దుప్పట్లు అందించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ

కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెం లో స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వినాయక నగర్ కాలనీకి చెందిన దాదాపు 90 మందికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు భోజనం మరియు దుప్పట్ల పంపిణి చేశారు. పునరావాస కేంద్రాల వద్ద
విద్యుత్ అంతరాయ సమస్యలు ఎదురైతే జనరేటర్లు ఏర్పాటు చేయాలని ఆమె అధికారులకు సూచించారు. ప్రతి పునరావాస కేంద్రం వద్ద వైద్య సిబ్బంది పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి సురక్షిత మంచినీళ్లు, నాణ్యమైన భోజన వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొడలూరు మండల టిడిపి అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, ఎంపీటీసీ కరకట్ట మల్లికార్జున్, తువ్వర ప్రవీణ్, బండి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed