*నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి సదా రుణపడి ఉంటా – డా. జెడ్ శివ ప్రసాద్, టిడిపి వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు*
ఆంధ్రప్రదేశ్ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు ఛైర్మన్ గా నాకు అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు.
తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం బలోపేతం కోసం నేను చేసిన సేవలను గుర్తించి నాకు గౌరవప్రదమైన నామినేటెడ్ పదవి బాధ్యతలను అప్పగించిన తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాను.
నాకు పదవి వచ్చేందుకు సహకరించిన జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, పార్లమెంటు సభ్యులు విపిఆర్, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, జిల్లాలోని శాసనసభ్యులు, జిల్లా టిడిపి అధిష్టానం కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
తెలుగుదేశం పార్టీ నాపై నమ్మకం ఉంచి ఇచ్చిన పదవికి న్యాయం చేసేలా, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా నడుచుకుంటానని హామీ ఇస్తున్నాను.