*నాయుడుపేటలో సీఎం చంద్రబాబు పర్యటన గ్రాండ్ సక్సెస్*

*కార్పొరేట్ స్థాయిలో టిడ్కో గృహాల నిర్మాణం – మంత్రి నారాయణ వెల్లడి.*

*అసంపూర్తిగా ఉన్న టిడ్కో ప్రాజెక్టుల కోసం 4,400 కోట్లు కేటాయింపు*.

*గతంలో డబ్బులు కట్టి ఇళ్లు రాని 83,869 మందికి 173 కోట్లు రీఫండ్*

తిరుపతి జిల్లా నాయుడుపేటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతమైంది, పేదల సొంతింటి కల సాకారమైంది.సభలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన టిడ్కో ప్రాజెక్టును సీఎం చంద్రబాబు చొరవతో 4,400 కోట్లతో పునరుద్ధరించి, పేదలకు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లను అందిస్తున్నామని ప్రకటించారు. గతంలో డబ్బులు చెల్లించి ఇళ్లు రాని 83,869 మంది బాధితులకు 173 కోట్లు రీఫండ్ చేయడం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్నారన్నారు .త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు చేయిస్తామని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed