
*నగరములోని భవనములు, డి ఫామ్ పట్టాలను కలిగిన ఇళ్లకు ఆస్తి పన్ను ఇంకను విధించని వాటిని గుర్తించి ఆస్తి పన్ను పరిధిలోకి తీసుకురావాలని అధికారులకు తెలిపిన కమిషనర్ వై ఓ నందన్*
నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ వారాంతపు సమీక్ష సమావేశంలో భాగంగా రెవిన్యూ సిబ్బందితో కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు మంగళవారం సమీక్ష నిర్వహించారు.
ఇందులో భాగంగా కమిషనర్ మాట్లాడుతూ రెవెన్యూ సిబ్బంది అందరూ వారాంతపు లక్ష్యాలను కచ్చితంగా వసూళ్లు చేయాలని, అలాగే సర్వీస్ రిక్వెస్ట్ లు నిర్దేశించిన సమయంలోపు పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే ఆన్లైన్లో నమోదు చేయునప్పుడు సంబంధించిన డాక్యుమెంట్ లన్నీ అప్లోడ్ చేయాలని నిర్దేశించిన సమయములోపుల సర్వీస్ రిక్వెస్ట్ లు పూర్తి చేయని సిబ్బందిని జీతము నుండి రికవరీ చేయబడడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయము సిబ్బందితో సమన్వయం చేసుకొని సర్వీస్ రిక్వెస్ట్ లు పరిష్కరించవలసినదిగా ఆదేశించారు.
రెవెన్యూ బకాయిలు, ఖాళీ స్థలముల పన్ను వసూళ్లపై శ్రద్ధ కనబరిచి సత్వరమే వసూళ్లకు చర్యలు చేపట్టాలని, బకాయి దారులకు నోటీసులు జారీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
నగరములోని భవనములు, డి ఫామ్ పట్టాలను కలిగిన ఇళ్లకు ఆస్తి పన్ను ఇంకను విధించని వాటిని గుర్తించి ఆస్తి పన్ను పరిధిలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా కమిషనర్ తెలియజేశారు.
నేషనల్ లోక్ అదాలత్ ద్వారా నోటీసులు జారీ చేసినా కూడా పన్ను చెల్లించని భవన యజమానుల పై సత్వరమే తదుపరి చర్యలు చేపట్టవలసినదిగా రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.
అలాగే రెవెన్యూ సిబ్బంది అందరూ సమిష్టిగా రెవెన్యూ వసూళ్లలో కొత్త విధానాలను అనుసరించి వసూళ్లకు చర్యలు చేపట్టాలని అని కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, టి.పి. ఆర్.ఓ. వాసు బాబు, రెవిన్యూ ఆఫీసర్ లు సమద్, శ్రీనివాసులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు