*నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్ కు ముఖ్యమంత్రి ఆత్మకూరు పర్యటన ప్రత్యేక బాధ్యతలు*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పర్యటనను పురస్కరించుకొని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ. నందన్ కు ప్రత్యేక బాధ్యతలను కేటాయించారు
.ముఖ్యమంత్రి సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాలలో పారిశుధ్య పనుల నిర్వహణ, సుందరీకరణ పనులు, రోడ్ల మరమ్మతు పనులు, వివిఐపీల పార్కింగ్ నిర్వహణ, క్యాటరింగ్ విభాగం నిర్వహణ తదితర అంశాలపై పూర్తిస్థాయి అధికారిగా నందన్ నియమించబడ్డారు.
ఈ ఉత్తర్వుల మేరకు కమిషనర్ వై.ఓ నందన్ బుధవారం ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.